Saudi Arabia Flood Video: ఎడారి దేశం సౌదీ అరేబియాలో కుండపోత వర్షాలు.. వరద నీటిలో జెడ్డా నగరం..
వాన ముంచెత్తింది.. వరద పోటెత్తింది.. రహదారులు జలమయం అయ్యాయి.. వీధులు వాగుల్ని తలపించాయి.. బైక్‌లు, కార్లు వరదలో కొట్టుకుపోయాయి.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.. చినుకు చిత్తడితో జనజీవితం అస్తవ్యస్తమైంది. ఇదీ ఎడారి దేశం సౌదీ అరేబియాలో పరిస్థితి.
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరాన్ని అకాల వర్షాలు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. భారీగా పొటెత్తుతున్న వరదలతో జనం అల్లాడిపోతున్నారు. సరిగ్గా 13ఏళ్ల క్రితం నాటి సీన్ మళ్లీ రిపీట్ అయింది. 2009 నవంబర్‌లో కూడా ఇలాగే వరదలు జెడ్డాను వణికించాయి. అప్పుడు ఏకంగా 122 మంది చనిపోయారు. తిరిగి ఇప్పుడు మరోసారి అదే నవంబర్‌లో జెడ్డా లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రంతా గ్యాప్ లేకుండా వాన కురిసింది. దాదాపు ఆరు గంటల్లో ఏకంగా 179మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, వీధులు జలాశయాలను తలపించాయి. అండర్ పాస్ రోడ్లపై నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నారు. భారీగా చేరిన వ్యర్థాలను తొలగించడానికి.. రవాణా వ్యవస్థను పునరుద్దరించడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాదిమంది శ్రమిస్తున్నారు.
ఉద్యోగాల కోసం, అవసరాల కోసం బయటికొచ్చే వారితో ట్రాఫిక్ స్థంభించిపోతుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి. అటు కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రం దగ్గర విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
السيول في شوارع #جدة_الأن pic.twitter.com/4UWQz4QUYJ
— مهدي السليمي (@mahdi_Alselimi) November 24, 2022
వర్షసూచనతో అధికారులు అలర్టయ్యారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విఙ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మక్కా, థువల్, జెడ్డా, రబీగ్ గవర్నరేట్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది అధికార యంత్రాంగం.
మర్ని అంతర్జాతీయ వార్తల కోసం