Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..
అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు విచారణకు హాజరుకానున్నారు.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్.. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాల మేరకు పీఎస్‌కు చేరుకుని విచారణకు హాజరయ్యారు.
అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు విచారణకు హాజరుకానున్నారు.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్.. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాల మేరకు పీఎస్‌కు చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటిని నుంచి బయలు దేరిన అల్లు అర్జున్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందజేశారు.
నోటీసులు ఎందుకంటే..
ఇదిలాఉంటే.. గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప2 ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. తీవ్రగాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.. అయితే.. ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శిస్తారని వార్తలొచ్చాయి..
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్‌పేట్ పోలీసులు చేరుకుని.. నోటీసులు ఇచ్చారు.. కిమ్స్‌కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాం గోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చి.. కిమ్స్ హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ పరామర్శ కు రావద్దు అని సూచించారు.. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్సై.. మేనేజర్ మూర్తికి నోటీసు ఇచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి