Watch Video: పడుకున్న సింహాన్ని రెచ్చగొట్టిన బర్రెల గుంపు.. సింహం రియాక్షన్ ఏంటంటే..
బలవంతులే గెలుస్తారన్నది సృష్టి ధర్మం. అయితే ఆ బలవంతులు కూడా ఏదో ఒక రోజు బలహీనులుగా మారాల్సిందే. ఎంతో శక్తివంతంగా ఉండే వారు కూడా మారిన కాలంతో పాటు తమ శక్తిని కోల్పోక తప్పదు. అది అడవికి రాజు సింహమైనా సరే. సింహం పంజా విసిరితే ఎంత భయకరంగా ఉంటుంది...
బలవంతులే గెలుస్తారన్నది సృష్టి ధర్మం. అయితే ఆ బలవంతులు కూడా ఏదో ఒక రోజు బలహీనులుగా మారాల్సిందే. ఎంతో శక్తివంతంగా ఉండే వారు కూడా మారిన కాలంతో పాటు తమ శక్తిని కోల్పోక తప్పదు. అది అడవికి రాజు సింహమైనా సరే. సింహం పంజా విసిరితే ఎంత భయకరంగా ఉంటుంది. అయితే అదే సింహం బలహీనంగా మారితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోనే దీనికి నిదర్శనం. వయసులో ఉన్నప్పుడు నాకంటే తోపులెవరు లేరనుకునే సింహం.. వయసు మళ్లిన తర్వాత ఎలా మారుతుందో చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తోందీ వీడియో.
వివరాల్లోకి వెళితే ఓ ముసలి సింహం అడవిలో సేదతీరుతోంది. ఇదే సమయంలో అక్కడికి ఒక బర్రెల గుంపు వచ్చింది. సహజంగా అయితే సింహం ఆ బర్రెలను భయపెట్టి పరిగెత్తించేంది. కానీ అది వయసు మళ్లింది కావడంతో సింహంపైకే బర్రెలు దాడి చేశాయి. సింహాన్ని కొమ్ములతో ఎత్తే అవతలపాడేశాయి. అయితే సింహం ఒకానొక సమయంలో బర్రెలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే దాని శక్తి మాత్రం అందుకు సహకరించలేదు. దీంతో చేసేదేమి లేక అక్కడే ఉన్న చెట్ల పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది.
View this post on Instagram
దీనంతటినీ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ డీన్ కెల్‌బ్రిక్ తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పవర్‌కు డెవినేషన్‌గా ఉండే సింహం అలా ఢీలా పడడం.. కాలంతో పాటు ఏదైనా మారాల్సిందే అన్న సందేహం ఇస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సింహంపై దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులకే ఆ సింహం మరణించినట్లు ఫొటోగ్రాఫర్ ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..