Naga Chaitanya: చైతూతో శోభిత ఫోటో వైరల్.. దీని వెనుక ఉన్న సీక్రెట్ అదేనా

అసలు ఈ ఫోటో నిజమేనా..? వారిద్దరూ నిజంగానే డేటింగ్‌లో ఉన్నారా...? చైతూ ఫ్యాన్స్ చెబుతున్న వెర్షన్ ఏంటి..?

Naga Chaitanya: చైతూతో శోభిత ఫోటో వైరల్.. దీని వెనుక ఉన్న సీక్రెట్ అదేనా
Sobhita Dhulipala - Naga Chaitanya
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2022 | 4:09 PM

టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరొందిన నాగచైతన్య, సమంత ఒక్కసారిగా విడిపోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. వారి తిరిగి కలవాలని ఇప్పటికీ చాలామంది కోరుకుంటున్నారు. ఇటీవల సమంత ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మయోసైటిస్‌తో బాధపడినప్పుడు సైతం.. ఈ కష్ట సమయంలో సామ్‌కు తోడుగా చైతూ ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ కామెంట్స్ ఏవీ పట్టించుకోకుండా తమ సినిమాలు తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు చైయ్, సామ్. అయితే వారికి సంబంధించిన వార్తలు మాత్రం నిత్యం హెడ్‌లైన్స్‌లో ఉంటూనే ఉన్నాయి. సమంత ప్రజంట్ ఒంటరిగా ఉంటూ ఉండగా.. చైయ్ మాత్రం నటి-మోడల్ శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తలను వారు ఖండించలేదు కూడా.

తాజాగా నాగ చైతన్య, శోభిత కలిసి దిగిన ఫోటో ప్రజంట్ ఇంటర్నెట్‌లో తెగ సర్కులేట్ అవుతుంది. వారి డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది. ఎక్కడో విదేశాల్లో వారు ఈ ఫోటో దిగినట్లు అర్థమవుతుంది. ఈ ఫోటో వెనుక ఉన్న అసలు నిజం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. అంటే వారు నిజంగానే వేకేషన్‌కి వెళ్లారా..? లేదా ఏదైనా షూట్‌కి వెళ్లినప్పుడు దిగిన ఫోటోనా అన్నది తెలియరాలేదు. అయితే వారిద్దరూ కావాలనే ఫోజు ఇచ్చినట్లుగా ఆ ఫోటో ఉంది. నిజంగా రిలేషన్‌లో ఉంటే సీక్రెట్‌గా ఉంచుతారు కానీ.. ఇంత బాహాటంగా ఫోటోలు దిగుతారా అని చైతూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అది అనుకోకుండా కలిసినప్పుడో లేదా ఏదో షూట్ కోసమో కలిసినప్పుడు తీసిన ఫోటో అని బలంగా వాదిస్తున్నారు.

ఇంకొదరి ఫ్యాన్స్ వెర్షన్ మరోలా ఉంది. వైరల్ అయిన ఫోటోను శ్రద్ధగా పరిశీలిస్తే, నాగ చైతన్య,  శోభిత ధూళిపాళల ఫోటోను ఫోటో షాప్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు. విడివిడిగా దిగిన ఫోటోలను వారు కలిసి ఉన్నట్లుగా కనిపించేలా చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఫోటోపై నెటిజన్స్ రకరకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే చైతన్య మొదటి తమిళ సినిమా వెంకట్ ప్రభు  దర్శకత్వంలో వస్తున్న కస్టడీ డిసెంబర్ 30 న విడుదల కానుంది. మరోవైపు, శోభిత మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ కోసం తన షూట్‌ను పూర్తి చేసింది. మొదటి సీజన్‌లో తారా ఖన్నా పాత్రలో నటించి ఆమె మంచి ప్రశంసలు అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..