Tollywood: అప్పుడు గోల్డెన్ లెగ్ ఇప్పుడు ఐరెన్ లెగ్.. బ్యాడ్ టైంతో ఇబ్బంది పడుతోన్న భామలు వీరే

ఆ టైం లో ఈ భామలు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఈ మధ్య మాత్రం వరుసగా ఫ్లాప్ లు అవుతున్నాయి.

Tollywood: అప్పుడు గోల్డెన్ లెగ్ ఇప్పుడు ఐరెన్ లెగ్.. బ్యాడ్ టైంతో ఇబ్బంది పడుతోన్న భామలు వీరే
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించాలని ఈ మధ్య ముద్దుగుమ్మలంతా తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి అలంటి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు.? 
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2022 | 4:06 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించడం అంటే అంత ఈజీ కాదు. అందం అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక వేళ వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ సక్సెస్ లు మాత్రం రావు.. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా ఉన్న బ్యూటీ ఇప్పుడు ఐరెన్ లెగ్ గా మారారు. ఆ టైం లో ఈ భామలు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఈ మధ్య మాత్రం వరుసగా ఫ్లాప్ లు అవుతున్నాయి. దాంతో ఈ భామలను ఐరెన్ లెగ్ అని అంటున్నారు కొందరు. నిజానికి సినిమా ఫలితాలు ఎవరి చేతిలో ఉండవు.. కేవలం ప్రేక్షకుల చేతిలో మాత్రమే ఉంటాయి. కానీ ఈ బ్యూటీస్ కు మాత్రం టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తుంది. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి. ఈ బ్యూటీ తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత ముకుంద సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక డీజే సినిమాలో అందాలు ఆరబోసి ప్రేక్షకులను కవ్వించింది.

అయితే నిన్నమొన్నటిదాకా పూజా నటించిన సినిమాలన్నీ మంచి హిట్స్ గా నిలిచాయి. కానీ ఈ మధ్య ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అలవైకుఠపురం లో సినిమా వరకు సూపర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా పర్లేదు అనిపించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్ వంటి సినిమాలు వరుస గా ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుంది ఈ భామ.

ఇక ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది కృతిశెట్టి. తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్న కృతిశెట్టి.. ఆవెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో విజయాలు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వారియర్, ఆ అమ్మయిగురించి మీకు చెప్పాలి,మాచర్ల నియోజకవర్గం సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక మరో ముద్దుగుమ్మ కీర్తిసురేష్. మహానటి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అనుకోలేక పోయింది కీర్తి. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమా హిట్ అయినప్పటికీ అది మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం నానితో దసరా, చిరంజీవి భోళాశంకర్ సినిమాలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..