Jai Balayya Song: శాస్త్రి గారు హర్టయ్యారు.. కానీ ట్రోలింగ్ వల్లో, నెటిజన్ల వల్లో కాదు…
ఆయన ఘాటైన ట్వీట్ చూస్తే శాస్త్రిగారు హర్ట్ అయ్యారని అర్థమైంది. తాను ఏ అభిమానుల వల్ల ఇబ్బంది పడలేదని మరో ట్వీట్‌లో క్లారిటీ ఇచ్చారు. మరీ అంతగా ఆయన మనసును కదిలించేలా మాట్లాడింది ఎవరు..?
బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాకు నెక్ట్స్ లెవల్ బజ్ ఉంది. రికార్డులు బద్దలవ్వడం పక్కా అని కెప్టెన్ గోపి సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలో తాజాగా రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘జై బాలయ్య’ నెట్టింట దుమ్మురేపుతుంది. మా దైవం బాలయ్య అనే అభిమానులకు అయితే ఈ పాట పిచ్చెక్కిస్తుంది. రిపీట్ మోడ్‌లో పాట వింటూ.. పూనకాలతో ఊగిపోతున్నారు. తమ హీరోకి ఇంత అద్భుతమైన సాహిత్యం అందించిన సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మ్యూజిక్ అందించిన తమన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్యూన్… విజయశాంతి ‘ఒసేయ్ రాములమ్మా’ మూవీలోని పాట ట్యూన్‌ని పోలి ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ లిరిసిస్ట్ రామ్ జోగయ్య శాస్త్రి హర్టయ్యారు. ఆవేదన, ఆక్రోశం కలబోసిన ట్వీట్ ఒకటి చేశారు. తొలుత కొందరు ఆయన్ను ట్రోల్ చేశారేమో అందుకే అంత ఘాటైన ట్వీట్ వేశారమే అనుకున్నారు.
తొలుత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ ఇది…
ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి?
— RamajogaiahSastry (@ramjowrites) November 25, 2022
దీంతో కొందరు నెటిజన్ల ట్రోలింగ్ వల్ల రామ్‌జో హర్టయ్యారని పలు వెబ్‌సైట్లో కథనాలు వచ్చాయి. అయితే తనను ఎవరూ ట్రోల్ చేయలేదని ఆ తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ట్వీట్ వేరే విషయం మీద అని చెప్పుకొచ్చారు. ట్రోలింగ్ లేదు ఏమి లేదు…అందరు ఫాన్స్ నేనంటే చాలా ఇష్టపడతారని రాసుకొచ్చారు. ముఖ్యంగా జై బాలయ్య పాట పట్ల అందరూ సాహిత్యాన్ని చాలా మెచ్చుకుంటున్నారని తెలిపారు. మరి ఆయన హర్టయిన అసలు విషయం ఏంటి..? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. మరో హీరో ఎవరైనా మాకు ఎందుకు ఇలాంటి పాటలు రాయవని అడిగారా..? ఆయన సరస్వతీపుత్ర ట్యాగ్ పట్ల ఇండస్ట్రీ వాళ్లు ఎవరైనా తప్పుగా మాట్లాడారా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..