Video: సూర్యనే మించిపోయావుగా.. వెరైటీ షాట్లతో నవ్వులు పూయించిన భారత బౌలర్.. 3 ఫోర్లు, 3 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్..

New Zealand vs India, 1st ODI: ఆక్లాండ్ వన్డేలో వాషింగ్టన్ సుందర్ 37 పరుగులతో చెలరేగడంతో భారత్ స్కోర్ 300 పరుగులు దాటింది.

Video: సూర్యనే మించిపోయావుగా.. వెరైటీ షాట్లతో నవ్వులు పూయించిన భారత బౌలర్.. 3 ఫోర్లు, 3 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్..
Ind Vs Nz Washington Sundar
Follow us
Venkata Chari

|

Updated on: Nov 25, 2022 | 2:19 PM

3 సిక్సర్లు, 3 ఫోర్లు… వాషింగ్టన్ సుందర్ కేవలం 6 బంతుల్లోనే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఈ 6 షాట్‌ల ఆధారంగా ఎవరూ ఊహించని అద్భుతాన్ని వాషింగ్టన్ సుందర్ చేసి షాక్ ఇచ్చాడు. సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ క్రీజులో దిగాడు. ఈ ఆటగాడు క్రీజులో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇస్తాడని అంతా భావించారు. కానీ, సుందర్ ప్లాన్ భిన్నంగా ఉండడంతో.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఈ మ్యాచ్‌లో సుందర్ కేవలం 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. చివర్లో వచ్చినా 231 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి పరుగుల వర్షం కురిపించాడు. దీంతో టీమిండియా స్కోర్ 300 పరుగులు దాటింది.

న్యూజిలాండ్ తరఫున మాట్ హెన్రీ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. అయితే, ఆ బౌలర్‌పైనే వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లు ఆడాడు. తన చివరి ఓవర్‌లో సుందర్ 2 ఫోర్లతోపాటు ఓ అద్భుతమైన సిక్సర్ బాదాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా భారత్ 300 పరుగులు దాటింది.

ఇవి కూడా చదవండి

అద్భుతమైన షాట్లతో అలరించిన సుందర్..

వాషింగ్టన్ సుందర్ తన ఇన్నింగ్స్‌లో 16 బంతులు మాత్రమే ఆడాడు. అయితే ఈ సమయంలో అతను 6 బౌండరీలు కొట్టాడు. మాట్ హెన్రీ వేసిన బంతిని సుందర్ బౌండరీ కొట్టాడు. వాస్తవానికి హెన్రీ ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని విసిరాడు. యార్కర్‌కు బదులుగా, అతని బంతి లోయర్ ఫుల్ టాస్‌గా మారింది. వెంటనే ప్లాన్ ఛేంజ్ చేసిన సుందర్ స్కూప్ ఆడాడు. అది బౌండరీ చేరింది. ఈ సమయంలో అతను డొర్లుకుంటూ కిందపడిపోయాడు. సుందర్ ఆడిన ఈ షాట్ తర్వాత, వికెట్ వెనుక షాట్లు ఆడడంలో పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్‌తో పోల్చుతున్నారు. వాషింగ్టన్ సుందర్ 9 నెలల తర్వాత వన్డేల్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అంతకుముందు ఈ ఆటగాడు ఫిబ్రవరి 11న వెస్టిండీస్‌తో ఆడాడు.

ఆక్లాండ్ వన్డేలో భారత్ బ్యాటింగ్ అదుర్స్..

ఆక్లాండ్ వన్డేలో భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆరంభం నిదానంగా సాగినా టీమ్ ఇండియా స్కోరు 306 పరుగులకు చేరుకుంది. శిఖర్ ధావన్ 72, శుభమన్ గిల్ 50 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 36 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. రిషబ్ పంత్, సూర్యకుమార్ బ్యాట్ ఏ మాత్రం పనిచేయలేదు. పంత్ 15, సూర్యకుమార్ 4 పరుగుల వద్ద ఔటయ్యారు. న్యూజిలాండ్‌ తరపున సౌదీ-ఫెర్గూసన్ తలో 3 వికెట్లు తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..