IND vs NZ 1st ODI: రికార్డ్ భాగస్వామ్యంతో షాకిచ్చిన లాథమ్, విలియమ్సన్.. తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం..

IND Vs NZ ODI Match Report Today: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ టీం కేవలం 3 వికెట్లు కోల్పోయి 47.1 ఓవర్లలోనే టార్గె‌ట్‌ను చేరుకుంది.

IND vs NZ 1st ODI: రికార్డ్ భాగస్వామ్యంతో షాకిచ్చిన లాథమ్, విలియమ్సన్.. తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం..
Ind Vs Nz 1st Odi Match Report
Follow us

|

Updated on: Nov 25, 2022 | 3:23 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. భారీ స్కోర్ చేసినా.. దానిని కాపాడుకోలేక 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ టీం కేవలం 3 వికెట్లు కోల్పోయి 47.1 ఓవర్లలోనే టార్గె‌ట్‌ను చేరుకుంది. దీంతో మూడు వన్డేల్ సిరీస్‌లో కివీస్ 1-0తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి స్థానంలో 3వ స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 80 పరుగులు చేశాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ 72, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 50 పరుగులతో రాణించారు. సంజూ శాంసన్ (36), వాషింగ్టన్ సుందర్ (37) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్‌లో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీశారు. ఒక వికెట్ ఆడమ్ మిల్నే ఖాతాలో పడింది.

అనంతరం న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసి, ఘనవిజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 94 పరుగులు, టామ్ లాథమ్ 145 పరుగులతో అజేయంగా నిలిచి, కివీస్‌ను విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 88 పరుగుల స్కోరు వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ పడింది. టామ్ లాథమ్ కెరీర్‌లో ఏడో సెంచరీ సాధించాడు. భారత్‌పై అతనికిది రెండో సెంచరీ.

ఇవి కూడా చదవండి

టామ్ లాథమ్ 7వ సెంచరీ..

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్ తన 7వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. అతని పేరు మీద మొత్తం 19 సెంచరీలు ఉన్నాయి. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 12 టెస్టు సెంచరీలు సాధించాడు.

ఉమ్రాన్ మాలిక్ ఖాతాలో 2 వికెట్లు..

అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్, డెవాన్ కాన్వే (24)ని అవుట్ చేయడం ద్వారా తన వన్డే కెరీర్‌లో మొదటి వికెట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్ (11) ఔటయ్యాడు.

విలియమ్సన్ స్వదేశంలో 3,000 వన్డే పరుగులు..

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన సొంత మైదానంలో 3,000 ODI పరుగులు చేశాడు. విలియమ్సన్ 54 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇరుజట్లు..

భారత ప్లేయింగ్ ఎలెవన్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..