Pakistan: కరోనాను మించిన మహమ్మారి.. పాకిస్థాన్‌లో 7,462 మంది చిన్నారులు మృతి..

Pakistan Children: పాకిస్తాన్‌లోని సింధ్‌లో న్యుమోనియా కలకలం సృష్టిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారులు న్యుమోనియా బారిన పడి మృతిచెందుతున్నారు. న్యుమోనియా బారిన పడి ఈ ఏడాదిలో..

Pakistan: కరోనాను మించిన మహమ్మారి.. పాకిస్థాన్‌లో 7,462 మంది చిన్నారులు మృతి..
Pakistan Children
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2021 | 2:44 PM

Pakistan: పాకిస్తాన్‌లోని సింధ్‌లో న్యుమోనియా కలకలం సృష్టిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారులు న్యుమోనియా బారిన పడి మృతిచెందుతున్నారు. న్యుమోనియా బారిన పడి ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ  7,462 మంది పిల్లలు మరణించినట్లు సింధ్ ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారు. అంతేకాదు 27,136  మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడ్డారని చెప్పారు. సింధ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు సహా ఈ వ్యాధిబారిన పడి చికిత్స తీసుకుంటున్నారని.. సుమారు 60% కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక ప్రావిన్స్‌లోని పట్టణ ప్రాంతంలో 40 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ప్రాణాంతక న్యుమోనియా వైరస్ కారణంగా 2021లో సింధ్‌లో 7,462 మంది పిల్లలు మరణించారు. ఐదేళ్లలోపు 27,136 మంది పిల్లలు న్యుమోనియా బాధితులని చెప్పారు. UNICEF ప్రకారం, న్యుమోనియా బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా శిలీంధ్రాల వల్ల వస్తుంది. పిల్లల ఊపిరితిత్తులు చీము, నీటితో నిండిపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మరణిస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల  ప్రకారం, మొత్తం పిల్లల మరణాలలో 16 శాతం న్యుమోనియా వల్లనే మరణిస్తున్నారని తెలుస్తోంది.

న్యుమోనియా అంటే ఏమిటి:  ఏదైనా ఇన్ఫెక్షన్ తో ఊపిరితిత్తులలో వాపు కలిగిస్తుంది.  దీనిని న్యుమోనియా అంటారు. చాలా వరకు న్యుమోనియా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పటికీ, ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. కరోనా మహమ్మారి దీనికి సజీవ సాక్ష్యం. పెద్దలు, పిల్లలకు న్యుమోనియా ప్రాణాంతకంగా మారింది.

Also Read:

ఆమ్‎వే, టప్పర్‎వేర్‎కు కేంద్రం షాక్.. డైరెక్ట్ సేల్స్‎పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం..