Pakistan PM Imran Khan: విశ్వాస పరీక్షకు ముందే గద్దె దిగనున్న పాక్ ప్రధాని?.. రేపు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం..
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని అందరూ భావించారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే సభ సోమవారానికి వాయిదా వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు స్పీకర్ అసద్ కైసర్. దీంతో ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారమే (మార్చి28) చర్చ జరగనుంది. దీంతో అప్పటివరకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (PM Imran Khan)కు కాస్త ఊరట దక్కినట్లయింది. కాగా దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్‌ఖాన్ పాటిస్తున్న విధానాలే కారణమంటూ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన సుమారు 100 మంది సభ్యులు ఈనెల8న ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం (No trust motion) ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
బల ప్రదర్శనకు..
కాగా అవిశ్వాస తీర్మానానికి ముందే తన ప్రజా బలాన్ని ప్రదర్శించుకునే పనిలో పడ్డారు పాక్ ప్రధాని. ఇందుకు ఆదివారం (మార్చి27) ఇస్లామాబాద్ పరేడ్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇక్కడే తన ప్రధాని పదవికి ఇమ్రాన్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి షేక్ రషీద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. పాక్‌లో ప్రస్తుతమున్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలకాలంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించడమొక్కటే ఆయుధమని ఆయన భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే సమయానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కోరినట్లు రషీద్ తెలిపారు. 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ముందస్తు ఎన్నికలను ప్రకటించాలని రషీద్ ప్రధానికి సూచించినట్లు సమాచారం. కాగా పాక్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023 చివరలో జరగాల్సి ఉంది.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
IPL 2022: ఐపీఎల్ నుంచి బీసీసీఐకు అన్ని వేల కోట్లా.. ఈ లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!