Russia Central Bank: కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నాలు.. పుతిన్‌కు షాకిచ్చిన హ్యాకర్లు..!

Russia Central Bank: ఉక్రెయిన్‌-రష్యా వార్‌ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునే లక్ష్యంగా రష్యా సైన్యం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా..

Russia Central Bank: కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నాలు.. పుతిన్‌కు షాకిచ్చిన హ్యాకర్లు..!
Follow us

|

Updated on: Mar 26, 2022 | 4:49 PM

Russia Central Bank: ఉక్రెయిన్‌-రష్యా వార్‌ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునే లక్ష్యంగా రష్యా సైన్యం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా (Russia Government) ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆ దేశ హ్యాకర్లు అధ్యక్షుడు పుతిన్‌ (Putin)కు షాకిస్తున్నారు. ఈ వారంలో రష్యా సెంట్రల్‌ బ్యాంకుకు చెందిన రహస్యాలను బహిర్గతం చేశౄమని గుర్తు తెలియని హ్యాకర్స్‌ గ్రూప్‌ అధికారికంగా ట్వీట్‌ చేసింది. తాజాగా Anonymous అనే హ్యాకర్స్‌ గ్రూప్‌ చీకటి ఒప్పందాలకు సంబంధించి 35వేల పేపర్లను బహిర్ఘతం చేస్తామని ట్వీట్‌ చేసింది. జస్ట్ ఇన్ #Anonymous కలెక్టివ్ రష్యా సెంట్రల్ బ్యాంక్‌ను హ్యాక్ చేశాం.48 గంటల్లో 35,000 కంటే ఎక్కువ రహస్య ఒప్పంద పత్రాలు విడుదల చేయబడతాయి అని ట్వీట్‌లో వెల్లడించింది.

అయితే నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా.. రష్యన్‌ హ్యాకర్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. త్వరలో మీరు ప్రపంచ హ్యాకర్ల ఆగ్రహానికి గురవుతారని ప్రకటించారు. వారు తెలిపినట్లుగానే ఈ వారం ప్రారంభంలో ఉక్రెయిన్‌ భవనాలపై దాడికి గురైన దృశ్యాలను ప్రజలకు చూపించేందుకు రష్యన్ స్టేట్ టీవీ నెట్‌వర్క్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా రష్యా సైన్యం కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండగా, రష్యా తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల్ని బట్టబయలు చేస్తున్నారు హ్యాకర్లు.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine Crisis: రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు గుండెపోటు.. కారణం అదే అంటూ ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు!

Ukraine Russia War: ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించడానికి భారత్ చైనా అనుకూలం.. మాట్లాడేందుకు సంసిద్ధత!