Pakistan: పాకిస్తాన్‌లో హిందూ మహిళ డేరింగ్ నిర్ణయం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్.. ఆమె ధైర్యం వెనుక…

మహిళల పట్ల నిర్లక్ష్యం, అణచివేత వంటి సమస్యలపై మాట్లాడిన సవేరా ప్రకాష్ తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ సమస్యలపై కృషి చేయడమే తన లక్ష్యమన్నారు. డాన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి ప్రకాష్  అడుగుజాడల్లో నడుస్తూ తన ప్రాంతంలోని వెనుకబడిన వారి కోసం పనిచేయాలన్నదే తన ఆకాంక్షని చెప్పింది. డిసెంబర్ 23న నామినేషన్ పత్రాలను సమర్పించిన సవేరా ప్రకాష్ PPPకి చెందిన సీనియర్ నేతలు తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారని.. గెలుపు కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది

Pakistan: పాకిస్తాన్‌లో హిందూ మహిళ డేరింగ్ నిర్ణయం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్.. ఆమె ధైర్యం వెనుక...
Savera Prakash Nomination
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2023 | 12:42 PM

బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇస్తూ భారత దేశాన్ని మత ప్రాతిపదికన విభజించారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పాలన కోసం ఎన్నికలను నిర్వహిస్తూనే ఉంది. ఆ దేశంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకూ సరికొత్త అధ్యయనానికి తాజా ఎన్నికలు తెర లేపాయి. కొత్త ఏడాదిలో 16వ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి ఫిబ్రవరి 8, 2024న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. నివేదికల ప్రకారం..

మొదటిసారిగా ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని బునేర్ జిల్లాకు చెందిన ఒక హిందూ మహిళ ఎన్నికల్లో పాల్గొనేందుకు నామినేషన్ దాఖలు చేసింది. సవేరా ప్రకాష్ బునేర్ జిల్లాలో PK-25 జనరల్ సీటులో పోటీ చేసేందుకు  అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించింది.

హిందూమతానికి చెందిన సవేరా ప్రకాష్ తండ్రి ఓం ప్రకాష్ రిటైర్డ్ డాక్టర్. అంతేకాదు ఆమె తండ్రి గత 35 సంవత్సరాలుగా PPPలో అంకితభావంతో పని చేస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సవేరా ప్రకాష్ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

సోమవారం డాన్ నివేదిక ప్రకారం క్వామీ వతన్ పార్టీ అనుబంధ రాజకీయ నాయకుడు సలీం ఖాన్.. రానున్న ఎన్నికల్లో బునెర్ స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలను సమర్పించిన మొదటి మహిళ సవేరా ప్రకాష్ అని అన్నారు.

PPP మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి

అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుండి 2022 గ్రాడ్యుయేట్ అయిన సవేరా ప్రకాష్.. బునెర్‌లో PPP మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. హిందువుల సంక్షేమం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ.. మహిళల అభివృద్ధికి, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి, మహిళల హక్కుల కోసం పోరాడం తన కోరిక అని సవేరా ప్రకాష్ స్పష్టం చేశారు.

నామినేషన్ ఫారం సమర్పించిన సవేరా ప్రకాష్

మహిళల పట్ల నిర్లక్ష్యం, అణచివేత వంటి సమస్యలపై మాట్లాడిన సవేరా ప్రకాష్ తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ సమస్యలపై కృషి చేయడమే తనపాక్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం హిందూ మహిళా అభ్యర్థి నామినేషన్ లక్ష్యమన్నారు. డాన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి ప్రకాష్  అడుగుజాడల్లో నడుస్తూ తన ప్రాంతంలోని వెనుకబడిన వారి కోసం పనిచేయాలన్నదే తన ఆకాంక్షని చెప్పింది. డిసెంబర్ 23న నామినేషన్ పత్రాలను సమర్పించిన సవేరా ప్రకాష్ PPPకి చెందిన సీనియర్ నేతలు తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారని.. గెలుపు కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

మానవాళికి సేవ చేయడం తన రక్తంలోనే ఉందని సవేరా ప్రకాశ్ ఉద్ఘాటించారు. రాజకీయాల్లో అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేయాలని ఎమ్మెల్యే కావాలనే కల తాను డాక్టర్ చదువుతున్న సమయంలో ఏర్పడిందని.. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, విధుల నిర్వహణలో నిస్సహాయత చూసిన సమయంలో తనకు ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక కలిగిందని చెప్పింది సవేరా ప్రకాష్.

రాజకీయాల్లో మహిళల ప్రాముఖ్యత

బునేర్ కి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఇమ్రాన్ నోషాద్ ఖాన్, సవేరా ప్రకాష్‌కి తన మద్దతుని చెప్పారు. తనకు రాజకీయాలతో అనుబంధంలేకపోయినా సవేరా గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో సాంప్రదాయ పితృస్వామ్యం పేరుతో  కొనసాగిస్తున్న మూస పద్ధతులను బద్దలు కొట్టినందుకు సవేరాను ప్రశంసించారు. బునర్ పాకిస్తాన్‌లో విలీనం కావడానికి 55 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఈ  ప్రాంతంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక మహిళ ముందుకు రావడం గొప్ప విషయం అని చెప్పారు. డాన్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP) ఇటీవలి సవరణలు జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళకు కేటాయించిన సంగతి తెల్సిందే..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?