China: చైనాపై పగబట్టిన ప్రకృతి.. మంచు తుఫాను విధ్వంసం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత.. 72 ఏళ్ల రికార్డు బద్దలు
చైనాలోని పలు నగరాల్లో మంచు కురుస్తున్న కారణంగా కర్ఫ్యూ విధించారు. అనేక పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించడానికి ప్రతి గంటకు వేలాది మంది పర్యాటకులు చేరుకుంటారు. అయితే శీతల గాలుల నేపధ్యంలో ప్రస్తుతం అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పక్షులు కూడా కనిపించడం లేదు. ప్రతిచోటా మంచు దర్శనమిస్తుంది.
మన దేశంలోనే కాదు పొరుగు దేశాల్లో కూడా శీతాకాలం చలి చంపేస్తుంది. పొరుగు దేశమైన చైనాలో చలిగాలులు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని బీజింగ్‌లో చలి తీవ్రత అక్కడ 72 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టింది. ఓ వైపు ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్‌ను స్వాగతించేందుకు ప్రపంచం అంతా బిజీగా ఉండగా మరోవైపు చైనాలోని పలు నగరాల్లో మంచు కురుస్తున్న కారణంగా కర్ఫ్యూ విధించారు. అనేక పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించడానికి ప్రతి గంటకు వేలాది మంది పర్యాటకులు చేరుకుంటారు. అయితే శీతల గాలుల నేపధ్యంలో ప్రస్తుతం అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పక్షులు కూడా కనిపించడం లేదు. ప్రతిచోటా మంచు దర్శనమిస్తుంది. మంచు దుప్పటి కప్పుకుని ధవళ వర్ణంతో అందాలను సంతరించుకున్నాయి. మంచు కురుస్తుండటంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
అంటార్కిటికా నుండి వచ్చిన తుఫాను కారణంగా.. ఉష్ణోగ్రత చాలా వేగంగా పడిపోయి చాలా ప్రాంతాల్లో పరిస్థితి చాలా భయంకరంగా మారిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీగా కురుస్తున్న మంచుని తొలగించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు. కేవలం ఒకటి, రెండు గంటల్లోనే ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీలకు పడిపోయింది. పడిపోతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండడంతో అనేక ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.
🌨️❄️ **SNOW STORM ALERT:** Daqing, Heilongjiang Province, China 🇨🇳, experiences a snowstorm. 📹 Video: Jim Yang#SnowStorm #ChinaWeather #Winter ❄️🌐 pic.twitter.com/sU8K6o6cqG
— ChroniBuzz (@liv59224) December 24, 2023
72 సంవత్సరాల రికార్డు బద్దలు
- 1951 తర్వాత మళ్లీ చైనాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.
- 72 ఏళ్ల తర్వాత డిసెంబర్ నెలలో చైనాలో ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
- రాజధాని బీజింగ్‌లో ఉష్ణోగ్రత మైనస్ జీరోకు చేరుకుంది. దీంతో 1951 రికార్డ్ బద్దలైంది.
- డిసెంబర్ 11వ తేదీ నుంచి ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైన 300 గంటలు ఉన్నాయి.
- 1951 తర్వాత ఇంత సుదీర్ఘ కాలం ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
- ఒక్క బీజింగ్ మాత్రమే కాకుండా చైనాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు ప్రస్తుతం చలి తీవ్రతతో అల్లాడిపోతున్నారు.
View this post on Instagram
మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్, బీజింగ్‌కు నైరుతి ప్రాంతాలలో భారీ హిమపాతం కారణంగా హీటర్ వ్యవస్థలు కూడా విఫలమయ్యాయి. అధిక డిమాండ్ కారణంగా జియాజువో నగరంలో థర్మల్ విద్యుత్ సప్లై ఆపివేశారు. Jiaozuo Wangfang అల్యూమినియం ఫ్యాక్టరీలో బాయిలర్లు విరిగిపోయాయి. దీంతో వేడినీరు సరఫరా కావడం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..