Viral News: ప్రతి క్రిస్మస్‌కు పెదవులకు సర్జరీ.. 20 లక్షలు ఖర్చు.. పెళ్లంటే పారిపోతున్న యువకులు..
కొందరికి శరీర నిర్మాణం నచ్చదు మరి కొందరికి ముఖం నచ్చదు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయిస్తున్నారు. తద్వారా వారు తమ ఇష్టానుసారం తమ శరీరంలోని భాగాలను మార్పు చేసుకుని శరీరాన్ని తయారు చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీపై మక్కువతో ఓ యువతి చేసిన పనిలో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ముఖం చూసిన వారు భయపడేలా మారింది.
భగవంతునిచే సృష్టించబడిన ప్రతి దేనికదే ప్రత్యేకమైనది. ప్రకృతిలో ప్రతి జీవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. సృష్టి నియమాలను ఎప్పటికీ తారుమారు చేయకూడదు. అది శారీరక నిర్మాణం అయినా.. జీవి మనుగడ కోసం ఏర్పడిన అలవాట్లైనా సరే.. అయితే ఆధునికత పేరుతో నేటి కాలంలో ప్రజలు సృష్టి నియమాలను పట్టించుకోవడం లేదు. కొందరికి అందం మీద మోజుతో తమ శరీరాన్ని ఇష్టపడడం లేదు. ఇలాంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొందరికి శరీర నిర్మాణం నచ్చదు మరి కొందరికి ముఖం నచ్చదు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయిస్తున్నారు. తద్వారా వారు తమ ఇష్టానుసారం తమ శరీరంలోని భాగాలను మార్పు చేసుకుని శరీరాన్ని తయారు చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీపై మక్కువతో ఓ యువతి చేసిన పనిలో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ముఖం చూసిన వారు భయపడేలా మారింది. వివరాల్లోకి వెళ్తే..
ఆ యువతి పేరు ఆండ్రియా ఇవనోవా. 26 ఏళ్లు.. ఇప్పుడు ‘పెద్ద పెదవులు ఉన్న మహిళ’ అని కూడా పిలుస్తున్నారు. నిజానికి ఆండ్రియాకు జన్మతః సన్నటి పెదవులు.. అయితే తన పెదవుల తీరు ఆమెకు నచ్చలేదు. మందపాటి పెదవులు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని ఆ యువతి నమ్మింది. దీంతో తన పెదవుల షేప్ ను మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావించింది. దీంతో ఆండ్రియా తన పెదవులను లావుగా మార్చుకోవడానికి ఫిల్లర్స్‌తో ఒకటి రెండుసార్లు కాదు చాలాసార్లు నింపింది. దీంతో ఆమె పెదవుల సాధారణ పరిమాణం కంటే చాలా రెట్లు పెద్దదిగా అయ్యాయి. అయితే ఇప్పుడు జనాలకు ఆండ్రియా పెదవులు నచ్చడం లేదు. అయితే ఆండ్రియాకు మాత్రం తన పెదవులంటే చాలా ఇష్టం.
పెద్ద పెదవుల కోసం రూ.20 లక్షల ఖర్చు
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, ఆండ్రియా బల్గేరియా నివాసి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆండ్రియా తన పెదవుల షేప్ ను మార్చుకోవడానికి 19 వేల పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఆండ్రియా తన పెదవుల్లో ఫిల్లర్‌లను నింపించుకుంటుంది. ఈ సంవత్సరం కూడా ఆండ్రియా పెదవుల్లో ఫిల్లర్లను నింపిన తర్వాత చాలా మందంగా మారాయి. ఓ వింత పెదాలుగా మారాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు భయపడుతున్నారు.
పెళ్ళికి భాగస్వామి దొరకడం లేదు
రిపోర్టుల ప్రకారం తన పెద్ద పెదవులను ఇష్టపడతానని చెబుతుంది ఆండ్రియా. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే ప్రత్యేకమైన రూపం కారణంగా ఎవరూ ఆండ్రియాని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే తన ఆకర్షణీయమైన లుక్స్‌ని.. ఇష్టపడి.. తనతో ఎవరైనా కంఫర్ట్‌గా ఉంటేనే తానువారిని ప్రేమించడానికి అంగీకరిస్తానని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..