AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Floods: పాక్ లో విజృంభిస్తోన్న చర్మ వ్యాధులు.. సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి విషమం అంటూ వైద్య సిబ్బంది ఆందోళన

నీరు నిల్వ ఉండడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. భారీగా పంటలు, ఆస్తులు నష్టంపోయాయి.  రోడ్లు మట్టి, శిధిలాలు, పేడతో నిండి ఉన్నాయి. తాజా పరిస్థితులతో దాయాది దేశంలో మలేరియా, కలరా,  హెర్పెస్ స్కేబీస్ వంటి చర్మ వ్యాధుల వ్యాప్తికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు. .

Pakistan Floods: పాక్ లో విజృంభిస్తోన్న చర్మ వ్యాధులు.. సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి విషమం అంటూ వైద్య సిబ్బంది ఆందోళన
Pakisthan Floods
Surya Kala
|

Updated on: Sep 18, 2022 | 7:18 PM

Share

Pakistan Floods: పాకిస్తాన్‌లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జూలై 2022 మధ్య నుండి పాకిస్తాన్‌లో ప్రారంభమైన భారీ రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉంది.  దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో 33 మిలియన్ల మంది ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీగా ఇల్లు ధ్వసం అయ్యాయి. నీరు నిల్వ ఉండడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. భారీగా పంటలు, ఆస్తులు నష్టంపోయాయి.  రోడ్లు మట్టి, శిధిలాలు, పేడతో నిండి ఉన్నాయి. తాజా పరిస్థితులతో దాయాది దేశంలో మలేరియా, కలరా,  హెర్పెస్ స్కేబీస్ వంటి చర్మ వ్యాధుల వ్యాప్తికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు. .

అల్ఖిద్మత్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న క్లినిక్‌లోని వైద్యులలో ఒకరైన డాక్టర్ సజ్జాద్ మెమన్ మాట్లాడుతూ, “మురికి, నీరు నిల్వ ఉండడం, అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా ప్రస్తుతం దేశంలో చర్మ వ్యాధులు ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు. ” మంగళవారం ఆయన మొబైల్ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌తో దురద, దద్దుర్లు తో ఉన్న రోగులను పరిశీలించారు. చాలా మంది ప్రజలు బురద నీటిలో నడుచుకుంటూ చెప్పులు లేకుండా నడిచి క్లినిక్‌కి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. రోజు రోజుకీ వరదబాధిత ప్రాంతాల్లో గజ్జి, ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని.. వైద్య సహాయం అందించడం ఇబ్బందికరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీరు చేరడం వల్ల అనేక వ్యాధులు: అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సురంజిత్ ఛటర్జీ TV9తో మాట్లాడుతూ, “భారీ వర్షాల వల్ల నీటి ఎద్దడి ఏర్పడిందని..  అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పేర్కొన్నారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో, టైఫాయిడ్, కలరా, షిగెల్లా (అతిసారం కలిగించే బ్యాక్టీరియా), విరేచనాలు (విరేచనాలు), అమీబియాసిస్ , హెపటైటిస్ A వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు సాధారణంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని ఆందోళలన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా వానాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్య జీర్ణశయాంతర వ్యాధులు. నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం ఉన్నందున, కామెర్లు, వాంతులు , విరేచనాలు కూడా సాధారణం. అంతేకాదు ప్రస్తుత వాతావరణంలో COVID-19 వంటి ఇతర వైరస్లు కూడా మనుగడ సాగించగలవు.. దీంతో మరింత ఇబ్బందినిని పెంచుతుందన్నారు.

సర్వోదయ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, జనరల్ ఫిజీషియన్ , సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సుమిత్ అగర్వాల్ మాట్లాడుతూ రుతుపవనాలు చాలా తేమను తీసుకొస్తాయి. ఈ తేమ గోడలపై ఫంగస్ పెరుగుదలకు కారణం అవుతుందని అన్నారు. “వర్షాకాలంలో మాత్రమే ఫంగస్ కనిపించనప్పటికీ, వర్షం తేమ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. వృద్ధులకు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు ఈ పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక ప్రకటనలో వరదల వల్ల ప్రభావితమైన మిలియన్ల మంది ప్రజలు మలేరియా,  డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులతో సహా పెద్ద ఆరోగ్య ముప్పులను ఎదుర్కొంటున్నారని హెచ్చరించింది. పాకిస్తాన్  దక్షిణాన ఉన్న సింధ్ ప్రావిన్స్ పై తీవ్రంగా  వరద ప్రభావం ఉంది. వరద నీటిలో భారీగా భూభాగాలు మునిగిపోయాయి. అనేక మంది గ్రామస్థులు నిరాశ్రయులయ్యారు. ఆహార సహాయం , వైద్య సహాయం కోసం ప్రధాన నగరాలకు వెళ్లవలసి వచ్చింది. వరదలు ప్రారంభమవ్వడానికి ముందు.. ఆ దేశంలో  ముందు, 4,531 మీజిల్స్ (తట్టు), 15 వైల్డ్ పోలియో వైరస్ కేసులు నమోదయ్యాయి. వర్షం, వరదలు ప్రభావిత ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా పోలియో టీకా ప్రచారానికి కూడా అంతరాయం ఏర్పడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..