AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: అఫ్గాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పంటలపై నిషేధం.. సహాయం కావాలని అభ్యర్థన

అఫ్గానిస్థాన్ (Afghanisthan) లో అధికారంలో ఉన్న తాలిబన్లు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. బాలికల విద్య, మహిళల హక్కులపై పలు ఆంక్షలు విధించిన ప్రభుత్వం..తాజాగా మరో...

Afghanistan: అఫ్గాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పంటలపై నిషేధం.. సహాయం కావాలని అభ్యర్థన
Taliban
Ganesh Mudavath
|

Updated on: Sep 02, 2022 | 6:36 AM

Share

అఫ్గానిస్థాన్ (Afghanisthan) లో అధికారంలో ఉన్న తాలిబన్లు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. బాలికల విద్య, మహిళల హక్కులపై పలు ఆంక్షలు విధించిన ప్రభుత్వం..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గంజాయి సాగుపై ఉక్కపాదం మోపేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రైతులు పత్తి, గోధుమ, మొక్కజొన్న పండించుకునేందుకు సహాయం కావాలని అంతర్జాతీయం సహాయం కోరుతోంది. ఇతర పంటలతో పోలిస్తే గంజాయి సాగు లాభ దాయకం. సాగు చేసేందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువే. అఫ్గానిస్థాన్ లో దశాబ్దాలుగా దీన్ని సాగు చేస్తున్నారు. గసగసాల సాగు సాకుతో హెరాయిన్‌ పండిస్తున్నారు. గతేడాది అఫ్గాన్ గసగసాల ముసుగులో లక్షా 70 వేల హెక్టార్లలో 650 టన్నుల హెరాయిన్‌ పండించారు. అక్కడి పేద, కౌలు రైతులకు ఈ పంటే గిట్టుబాటు అవుతోంది. ఐక్యరాజ్య సమితి 2021 నివేదిక ప్రకారం హెరాయిన్‌ ఉత్పత్తి అఫ్గానిస్థాన్ స్థూల దేశీయోత్పత్తి 7% చేరేందుకు ఉపయోగపడింది. 1990 వ దశకం చివరలో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి సాగుపై నిషేధం అమలు చేశారు. అయితే 2001లో అమెరికా దళాల రాకతో రైతులు తిరిగి గంజాయి సాగువైపు మొగ్గు చూపారు. ఈసారి తాలిబన్లు గసగసాల సాగుమీద ఉక్కుపాదం మోపారు. ప్రత్యామ్నాయంగా పత్తి, గోధుమ, మొక్కజొన్న పండించుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో అఫ్గాన్ లో గసగసాలు అత్యధికంగా సాగు చేసే హెల్మాండ్‌ ప్రావిన్స్‌ రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి.

అఫ్గాన్ రైతులకు ఇటీఇల వరకూ గసగసాలను పండితే కిలో 330 అమెరిక్‌ డాలర్లు లభించేది. ఇప్పుడు నిషేధం అమల్లోకి రావడంతో దాని ధర 1600 నుంచి 2200 డాలర్లకు పెరిగింది. గోధుమ, మొక్కజొన్న పంటలు ఆహారానికి పనికి వస్తున్నా, వాటిని అమ్ముకోలేకపపోతున్నామని రైతులు చెబుతున్నారు. పత్తి సాగుతో కిలోకు 11 అమెరికా డాలర్లు మాత్రమే వస్తుంది. తమకు వచ్చే ఆదాయంతో యజమానులకు చెల్లించుకున్న తర్వాత తమకు ఏమీ మిగలడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గంజాయి సాగుపై తాము చిత్తశుద్దితో నిషేధాన్ని అమలు చేస్తున్నందున అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలవాలని తాలిబన్‌ ప్రభుత్వం కోరుతోంది. వ్యాపారవేత్తలు కంపెనీలు ముందుకు వచ్చి వ్యవసాయ ఆధారిత కంపెనీలను ప్రారంభిస్తే తమ దేశంలోని పేద రైతులకు ఆసరాగా ఉంటుందని వారు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి