Google: గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక! ఈ 5 ఎక్స్‌టెన్షన్లను వెంటనే డిలీట్ చేయండి..
త కొన్ని రోజులుగా ముందెన్నడూ లేని విధంగా ఇంర్నెట్ యూజర్స్ విపరీతంగా పెరిగిపోయారు. దీనిని ఛాన్స్‌గా తీసుకుని హ్యాకర్స్ చేతివాటం చూపిస్తున్నారు. వెబ్ బ్రౌజింగ్‌లో ఇతర ఫీచర్ల కోసం బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్..
Google Chrome Hacking websites: స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక ప్రతి ఒక్కరూ నెట్టింట బిజీ బిజీ అయిపోయారు. వెబ్ బ్రౌజింగ్‌లో ప్రతి ఒక్కరూ చెయ్యి తిరిగిపోయారు. గత కొన్ని రోజులుగా ముందెన్నడూ లేని విధంగా ఇంర్నెట్ యూజర్స్ విపరీతంగా పెరిగిపోయారు. దీనిని ఛాన్స్‌గా తీసుకుని హ్యాకర్స్ చేతివాటం చూపిస్తున్నారు. వెబ్ బ్రౌజింగ్‌లో ఇతర ఫీచర్ల కోసం బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ ఉపయోగించడం సర్వసాధారణం. ఐతే వీటిల్లో కూడా నకిలీ ఎక్స్‌టెన్షన్లు ఉంటాయని మీకు తెలుసా! తాజాగా గూగుల్ క్రోమ్‌లో ఇలాంటి 5 నకిలీ ఎక్స్‌టెన్షన్లు యూజర్ డేటాను సేకరించి హ్యాకర్స్‌కు పంపుతున్నట్లు గూగుల్ గుర్తించింది. దీంతో వెంటనే సదరు ఐదు ఎక్స్‌టెన్షన్స్‌ను వెంటనే డిలీట్ చేయవల్సిందిగా గూగుల్ సూచిస్తోంది. నిజానికి ఇలాంటి నకిలీ ఎక్స్‌టెన్షన్లను బ్రౌజింగ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తొలగిస్తుంటాయి. ఐతే తాజాగా Netflix Party, Netflix Party 2, Flipshope, Full Page Screenshot Capture, AutoBuy Flash Sales అనే ఐదు ఎక్స్‌టెన్షన్లు గూగుల్ క్రోమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. అంతేకాకుండా ఇప్పటివరకు వీటిని 14 లక్షల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు గూగుల్ గుర్తించింది. ఇవి యూజర్ల డేటా లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ McAfee తెలిపింది. గూగుల్ ఇప్పటికే వీటిని తొలగించింది. యూజర్లు కూడా వీటిని వెంటనే డిలీట్ చేయమని మెకాఫే McAfee సూచించింది.