AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan: మరోసారి బయటపడిన పాక్ వక్రబుద్ధి.. దిగుమతులపై ఒక్క రోజులోనే నిర్ణయం వెనక్కి..

Pakistan Cabinet: పాకిస్తాన్ తన వక్రబుద్దిని మరోసారి నిరూపించుకుంది. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా.. ఇలాగే ఉంటామంటూ 24 గంటల వ్యవధిలోనే పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్‌పై కక్ష సాధింపు

India-Pakistan: మరోసారి బయటపడిన పాక్ వక్రబుద్ధి.. దిగుమతులపై ఒక్క రోజులోనే నిర్ణయం వెనక్కి..
India-Pakistan
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2021 | 12:19 AM

Share

Pakistan Cabinet: పాకిస్తాన్ తన వక్రబుద్దిని మరోసారి నిరూపించుకుంది. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా.. ఇలాగే ఉంటామంటూ 24 గంటల వ్యవధిలోనే పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై అంతకుముందు నిషేధం విధించిన పాకిస్తాన్.. తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంపై బుధవారం మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి పత్తి, చక్కెరను దిగుమతి చేసుకోవాలని పాక్ ఆర్థిక సమన్వయ కమిటీ.. మంత్రి మండలికి సిఫారసు చేసింది. దీనిని మంత్రి మండలి కూడా మొదట అంగీకరించింది. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్‌ పడింది. తాజాగా గురువారం.. భారత్‌ నుంచి వస్తువుల దిగుమతిని పాకిస్తాన్ క్యాబినెట్ నిరాకరించింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి ట్విట్ చేశారు. జమ్మూకాశ్మీర్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ ఇరు దేశాల దౌత్య సంబంధాలు మెరుగుపడవని మజారి పేర్కొన్నారు.

2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీరుకు ప్రత్యేక హోదాను రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పాకిస్తాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని నిరసిస్తూ పాకిస్తాన్ భారత్‌తో వాణిజ్య సంబంధాలను ఏకపక్షంగా తెంచుకుంది. 2019 ఆగస్టు నుంచి భారత్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ జరగడం స్వాగతించదగినదేనని చాలా మంది పేర్కొంటున్న సమయంలో.. పాక్ ఈ నిర్ణయం తీసుకోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్‌ వైఖరి ఇలాగే కొనసాగితే అక్కడ ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది.

Also Read:

H1b Visa: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్.. ఆ నిషేధం ఇకపై లేదు..

మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లిన కాలిఫోర్నియా.. చిన్నారితోసహా నలుగురు వ్యక్తులు దుర్మరణం