Pakistan News: ఆర్మీ, న్యాయవ్యవస్థను విమర్శిస్తే ఐదేళ్ల జైలు శిక్ష.. ఆమోదం తెలిపిన పాక్ కేబినెట్
పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఇప్పుడు మీడియాను కట్టడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆర్మీ, న్యాయవ్యవస్థను విమర్శిస్తే ఐదేళ్ల జైలు శిక్షను పాక్ కేబినెట్ ఆమోదించింది.
Pakistan Cabinet on Media: పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) సర్కార్ ఇప్పుడు మీడియా(Media)ను కట్టడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆర్మీ, న్యాయవ్యవస్థ(Judiciary)ను విమర్శిస్తే ఐదేళ్ల జైలు శిక్షను విధించేందుకు పాక్ కేబినెట్ ఆమోదించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల పాకిస్థాన్ పతనం దిశగా పయనిస్తోందని ఆ దేశ మీడియా ప్రభుత్వాన్ని హెచ్చరించడం ప్రారంభించడంతో.. అనేక ఆంక్షలు విధించారు. ముఖ్యంగా పాకిస్థాన్ సైన్యం(Pak army), న్యాయవ్యవస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలను విమర్శిస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు తీసుకున్న నిర్ణయానికి పాకిస్తాన్ ఫెడరల్ క్యాబినెట్ శనివారం ఆమోదించింది. అలాగే, ఎలక్ట్రానిక్ నేరాల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలక్ట్రానిక్ క్రైమ్స్ ప్రివెన్షన్ యాక్ట్‌లో సవరణకు ఆర్డినెన్స్ ద్వారా ఫెడరల్ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని స్థానిక మీడియా పేర్కొంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారు ఇప్పుడు భయపడాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. మీడియాలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంచుకునే వారిని బెయిల్ లేకుండా అరెస్టు చేస్తామని చెప్పారు. చట్టంలో మార్పులు చేస్తున్నామని, ఆ తర్వాత అలాంటి కేసులపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని.. సోషల్ మీడియాకు సంబంధించిన చట్టం చేయాలని పాకిస్థాన్‌లో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఫవాద్ చౌదరి తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తులకు వ్యతిరేకంగా లేదా సంస్థలను విమర్శిస్తే కూడా చర్య తీసుకుంటారా అని అడిగినప్పుడు, వ్యక్తిత్వం, సంస్థలపై పోస్ట్ చేసినందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మార్చడానికి సోషల్ మీడియాలో ప్రజలను అవమానించడం శిక్షార్హమైన నేరంగా మార్చడానికి ప్రతిపాదించిన చట్టాలను ఫెడరల్ క్యాబినెట్ ఆమోదం కోసం పంపినట్లు ఫవాద్ చౌదరి అంతకుముందు చెప్పారు. మొదటి చట్టం చట్టసభ సభ్యులను ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. రెండవ చట్టం ప్రజలు సోషల్ మీడియాను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. వ్యక్తులను గానీ ప్రభుత్వ రంగ సంస్థలను గానీ అవమానించడం శిక్షార్హమైన నేరం అవుతుందని ఫవాద్ చౌదరి పేర్కొన్నారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ECP ప్రవర్తనా నియమావళిని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం, సోషల్ మీడియాలో ఇతరుల గౌరవాన్ని కించపరిచే ప్రస్తావనతో, ఆరు నెలల్లో కోర్టులు అలాంటి కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఫవాద్ వివరించారు. ఫెడరల్ ప్రభుత్వం సంస్థలపై విమర్శలను అహింసాత్మక పోలీసు నేరంగా చేయాలని నిర్ణయించిందని స్థానిక మీడియా పేర్కొంది. ఎలక్ట్రానిక్ క్రైమ్ ప్రివెన్షన్ యాక్ట్ 2016లో సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత సవరణ ద్వారా సంస్థలను విమర్శించేవారికి మూడు నుంచి ఐదేళ్ల వరకు జరిమానా విధించనున్నట్లు నివేదిక పేర్కొంది.దీని ప్రకారం, ఎలక్ట్రానిక్ నేరాల నిరోధక చట్టాన్ని సవరించే ఆర్డినెన్స్ త్వరలో జారీ కానుంది.
Read Also… B.S.Yediyurappa: మరోసారి ముఖ్యమంత్రిగా యడియూరప్ప!.. అసలు విషయం ఏమిటంటే..