Russia -Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం.. సరిహద్దులో కాల్పుల మోత.. కేంద్రం కీలక నిర్ణయం

రష్యా ఉక్రెయిన్​ మధ్య యుద్ధం తప్పదా? చూస్తుంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. తాజాగా రెండు దేశాల సరిహద్దులో కాల్పుల మోతతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌ రిక్వెస్ట్‌ను రష్యా అధ్యక్షులు పుతిన్‌ ఏమాత్రం పట్టించుకోవడంలేదు.

Russia -Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం.. సరిహద్దులో కాల్పుల మోత.. కేంద్రం కీలక నిర్ణయం
Russia Ukraine Conflicts
Follow us

|

Updated on: Feb 20, 2022 | 9:37 PM

Russia -Ukraine Conflicts: రష్యా ఉక్రెయిన్​ మధ్య యుద్ధం తప్పదా? చూస్తుంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. తాజాగా రెండు దేశాల సరిహద్దులో కాల్పుల మోతతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌ రిక్వెస్ట్‌ను రష్యా అధ్యక్షులు పుతిన్‌(Vladimir Putin) ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇదిలావుంటే, భారత(India) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులు ఉక్రెయిన్‌ నుంచి వెంటనే వచ్చేయాలని కేంద్రం సూచించింది. ఇందు కోసం ప్రత్యేక విమానాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార(Indian Embassy) కార్యాలయ అధికారుల కుటుంబాలను భారతదేశానికి తిరిగి రావాలని కోరినట్లు సమాచారం.

రష్యా ఉక్రెయిన్ మధ్య అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్‌పై ఎప్పుడైనా దాడి చేయవచ్చని అమెరికా చెబుతోంది. మరోవైపు పుతిన్ కార్యాలయం నుంచి కూడా ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. మేం ఎవరిపైనా దాడి చేయలేదు. డాన్‌బాస్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అదే సమయంలో, ఉక్రెయిన్‌తో ఉద్రిక్తత గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య సుమారు ఒక గంట 45 నిమిషాల పాటు సుధీర్ఘ చర్చలు కూడా జరిగాయి.

మరోవైపు, రష్యా ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయి. ఏ క్షణంలో అయినా యుద్ధం జరగొచ్చు అనే సంకేతాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా ఆ దేశాల సరిహద్దు వెంబడి కాల్పుల మోత మోగింది. ఉక్రెయిన్​ సైనికులు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులు ఒకరిపై ఒకరు మోటార్​ షెల్స్​తో దాడి చేసుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భీకర శబ్దాలు వినిపించాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు స్థానికులు. తమపై దాడి చేశారన్న ఆరోపణలతో, ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగే అవకాశం ఉందని చాలా దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు సరిహద్దు వెంబడి కాల్పులు జరుగుతుండటంపై సర్వత్రా ఆందోనళ నెలకొంది.

ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది భారత ప్రభుత్వం. ఉక్రెయిన్‌ దేశంలో ఉన్న భారతీయులు వెంటనే ఇండియాకు వచ్చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్‌ బార్డర్‌లో ఉన్నవారు తక్షణమే వచ్చేయాలని సూచించింది మోదీ సర్కార్. అందుకు ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంచామని, వీలైనంత త్వరగా భారత్‌ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది భారత ప్రభుత్వం. ఒక్క భారతే కాదు, ఇంకా అనేక దేశాలు ఇలాంటి ప్రకటనలే చేశాయి. దీంతో యుద్ధం తప్పదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉక్రెయిన్​ను రష్యా ఇప్పటికే మూడు వైపులా చుట్టుముట్టింది. 1.5లక్షల మంది సైనికులు, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్​కు సమీపంలోని బెలారస్​లో మిలిటరీ విన్యాసాలు చేపట్టింది రష్యా. దీంతో ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్రంగా మారింది.

ఇదిలావుంటే, ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగితే, రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఆమెరికా సహా అనేక దేశాలు ఇప్పటికే తేల్చిచెప్పాయి. అటు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వోలోదిమిర్​ జెలెన్​స్కీ పరిస్థితులను శాంతిపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము దౌత్యపరంగానే ముందుకు వెళతామని స్పష్టం చేశారాయన. సంక్షోభానికి ముగింపు పలికేందుకు, కలిసి పనిచేద్దామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ను కోరారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు. సమావేశానికి సంబంధించిన వేదికను సైతం పుతిన్​ చెప్పాలని కోరారాయన. కానీ జెలెన్​స్కీ పిలుపును రష్యా పట్టించుకోలేదు.

మరోవైపు, సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు వారం రోజుల నుంచి చెబుతూ వస్తోంది రష్యా. అయితే వీటిని తాము నమ్మడం లేదని ప్రపంచ దేశాలు అంటున్నాయి. ముఖ్యంగా రష్యా వ్యవహారంపై అమెరికా చాలా సీరియస్‌గా ఉంది. దండయాత్ర చేసేందుకు సరిహద్దు వెంబడి 40 50 శాతం రష్యా దళాలు సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది వైట్‌హౌజ్. ఉక్రెయిన్​పై రష్యా కచ్చితంగా దాడి చేస్తుందని మరోసారి చెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఈ విషయంపై చర్చించేందుకు సలహాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు బైడెన్​. పరిస్థితిని అదుపు చేసేందుకు దౌత్యపరమైన చర్చలు నడుస్తూనే ఉన్నాయి. పలు దేశాల అధికారులు, రష్యా ఉక్రెయిన్​లతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే, అవి పెద్దగా ఫలితాల్ని ఇస్తున్నట్టు కనిపించడం లేదు.

Read Also…  UP Elections: ఉత్తరప్రదేశ్ మూడో విడత పోలింగ్ ప్రశాంతం.. ఈవీఎంలలో 627 మంది అభ్యర్థుల భవితవ్యం