AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలపై భారత్ దాడులు..?

పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. ఆ వివరాలు

పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలపై భారత్ దాడులు..?
Pakistan Airbase Attacks 1
Ravi Kiran
|

Updated on: May 10, 2025 | 5:19 AM

Share

పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఇస్లామాబాద్, లాహోర్‌, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్‌లోని రఫికి ఎయిర్‌బేస్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. ఈ దాడి రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచుతుందని అన్నారు. మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తు్న్నట్లు పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, షోర్‌కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!