UK- Omicron: రోజురోజుకీ బ్రిటన్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. డెల్టా కంటే ప్రమాదకరమంటున్న ప్రధాని జాన్సన్

UK- Omicron: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి యూరోపియన్ దేశాలు వణికిపోతున్నాయి. రోజులో రూపం సంతరించుకుంటూ ఈ మహమ్మారి విజృభిస్తూ.. ఐరోపా ఖండంలో..

UK- Omicron: రోజురోజుకీ బ్రిటన్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. డెల్టా కంటే ప్రమాదకరమంటున్న ప్రధాని జాన్సన్
Omicron Uk
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2021 | 5:52 PM

UK- Omicron: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి యూరోపియన్ దేశాలు వణికిపోతున్నాయి. రోజులో రూపం సంతరించుకుంటూ ఈ మహమ్మారి విజృభిస్తూ.. ఐరోపా ఖండంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం తన క్యాబినెట్ సభ్యులతో మాట్లాడుతూ, డెల్టా వేరియంట్ కంటే కరోనా వైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ చాలా అంటువ్యాధిగా మారిందని చెప్పారు. అందుకనే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ప్రస్తుతం UKలో డెల్టా వేరియంట్‌ల కేసులు ఎక్కువగా ఉన్నాయని  క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. ఇదే విషయంపై ప్రధానమంత్రి కార్యాలయ ప్రతినిధి విలేకరులతో మాట్లాడుతూ.. కోవిడ్ -19 యొక్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చాలా అధికంగా ఉందని..  చెప్పారు.

బ్రిటన్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్   బాధిత కేసులు 101 నమోదయ్యాయని జాన్సన్ చెప్పారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య  437కి చేరుకుందని ప్రకటించారు.  తమ దేశంలో ఒమిక్రాన్  గురించి ఎటువంటి నిర్ధారణకు రాలేదని.. అయినప్పటికీ తాము డెల్టా కంటే ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తినుంచే అంటువ్యాధిగా భావిస్తున్నామని.. అందుకు ప్రారంభ దశలోనే నమోదవుతున్న కేసులే సాక్ష్యమని అన్నారు.

ప్రయాణ నియమాలు: 

Omicron వ్యాప్తిని ఆపడానికి, బ్రిటన్ కూడా కొత్త నిబంధనలను అమలోకి తీసుకుని వచ్చింది. దీని ప్రకారం భారతదేశంతో సహా విదేశాల నుండి  యూకేకి వచ్చే ఏ ప్రయాణికుడైనా సరే..  ప్రయాణానికి 48 గంటల ముందు కోవిడ్-19 పరీక్షచేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ రెండు డోసులను పూర్తి చేసుకున్నవారికి కూడా కరోనా పరీక్షలు తప్పని సరి అని.. ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. ఒమిక్రాన్‌తో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానం వచ్చినవారు 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఒంటరిగా గడపాలని సుచినారు.

రెడ్ లిస్ట్‌లోని దేశాలు: 

బ్రిటన్ ప్రభుత్వం కొన్ని దేశాలను ‘రెడ్ లిస్ట్’ లో చేర్చింది. ఈ దేశాల నుంచి స్వదేశానికి లేదా బ్రిటన్ కు వచ్చే ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రకటించింది. బోత్సువానా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్,  లెసోతో, మలావి, మొజాంబిక్, నమీబియా, నైజీరియా, దక్షిణాఫ్రికా, జాంబియా, జింబాబ్వే దేశాలను రెడ్ లిస్ట్ లో పెట్టింది. ఈ దేశాలనుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని  సూచించింది.

Also Read: అమరజవాను సాయి తేజ్ కుటుంబానికి మంచు విష్ణు బాసట.. పిల్లల చదువు ఖర్చులను భరిస్తామంటూ..