Journey In Flight Landing Gear: అమెరికాలో వింత ఘటన.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని.. వైరల్ అవుతున్న వీడియో
ఇప్పుడు మీరొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోబోతున్నారు. ఈ వ్యక్తి చేసిన పని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా విమాన ప్రయాణం అంటే ఎంతో జాగ్రత్తతో కూడుకున్నది.
ఇప్పుడు మీరొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోబోతున్నారు. ఈ వ్యక్తి చేసిన పని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా విమాన ప్రయాణం అంటే ఎంతో జాగ్రత్తతో కూడుకున్నది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకూ ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. విమాన ప్రయాణానికి సంబంధించి ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, అన్నిరకాలుగా సేఫ్ అనుకున్నకే విమానం టేకాఫ్ చేస్తారు. అలాంటిది ఈ వ్యక్తి ఎలా అందులో ప్రవేశించాడో తెలియదు కానీ.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్నాడు.. ఆ తర్వాత ఏం జరగిందంటే…అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్‌లో ఓ వ్యక్తి దాక్కుని ఏకంగా 3 గంటలపాటు ప్రయాణించాడు. విమానం మరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. విమానం గాటిమాలా నుంచి మియామి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ప్రయాణించినా.. ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యక్తి చేసిన సాహసానికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.