‘ఎవరెస్ట్ శిఖరంపై కోవిడ్’ ! నార్వే పర్వతారోహకుడికి కరోనా వైరస్ పాజిటివ్, ఇప్పుడు నెగెటివ్ అట !
ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన నార్వే వాసికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అతడిని ఎర్లెండ్ నెస్ గా గుర్తించారు.
ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన నార్వే వాసికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. అతడిని ఎర్లెండ్ నెస్ గా గుర్తించారు. ఇతడు ఎవరెస్ట్ పర్వతాహారోహకుల్లో కరోనా పాజిటివ్ సోకిన మొదటి వ్యక్తి అయ్యాడు. పాజిటివ్ సోకినట్టు తెలియగానే ఇతడిని ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 15 న తనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిసిందని, గత గురువారం మళ్ళీ టెస్ట్ జరపగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఈయన తెలిపాడు. ఎర్లెండ్ నెస్ ప్రస్తుతం నేపాల్ లో ఓ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కాగా కరోనా వైరస్…. ఈ పర్వతం బేస్ క్యాంపులో ఉన్న వందలాది గైడ్లు, పర్వతారోహకులకు సోకవచ్చునని, అందువల్ల వీరందరికీ తక్షణమే టెస్టులు నిర్వహించాలని మౌంటెయిన్ గైడ్ ఆస్ట్రియన్ ల్యూకాస్ సూచించాడు. బేస్ క్యాంపు లో ఉన్నవారందరికీ టెస్టులు నిర్వహించకపోతే ముప్పే అన్నాడు. వారిని ఐసొలేట్ చేయాలని, టీమ్ లమధ్య కాంటాక్ట్ ఉండరాదని ఆయన చెప్పాడు. నార్వే వాసి ఎర్లెండ్ కొన్ని వారాల తరబడి ఇతరులతో కలిసి ఉన్న విషయాన్ని ఈయన గుర్తు చేశాడు.
అయితే ప్రస్తుతానికి ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఎలాంటి యాక్టివ్ కేసులు లేవని, కోవిడ్ కేసుల గురించి సమాచారమేదీ తమవద్ద లేదని కేవలం న్యుమోనియా, ఆల్టిట్యుడ్ సిక్ నెస్ కేసుల గురించిన సమాచారమే తమకు తెలిసిందని మౌంటెయినీరింగ్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ మీరా ఆచార్య చెప్పారు. గత ఏడాది పాండమిక్ కారణంగా పర్వతారోహణను ప్రభుత్వం అనుమతించలేదు. కానీ ఈ ఏడాది ఈ శిఖరాన్ని ఎక్కేందుకు వివిధ దేశాల నుంచి మొదటిసారిగా టూరిస్టులు వచ్చారు. నేపాల్ లో వసంత కాలం (మార్చి-మే నెలల మధ్య) ప్రారంభం కాగానే వాతావరణం బాగుంటుంది గనుక పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పర్వతారోహకులు ఇక్కడికి చేరుతుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: RT-PCR పరీక్ష కూడా అంతంతేనా..! మ్యుటేషన్ కరోనా రకాలు అంతుచిక్కడం లేదట.. కొత్త లక్షణాలతో కోవిడ్ మహమ్మారి.?
Double Mask: డబుల్ మాస్కింగ్ అంటే ఏమిటి? ఎందుకు అలా చేయాలి? కరోనాను ఎదుర్కోవడంలో దాని ప్రభావం ఎంత?