AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Double Mask: డబుల్ మాస్కింగ్ అంటే ఏమిటి? ఎందుకు అలా చేయాలి? కరోనాను ఎదుర్కోవడంలో దాని ప్రభావం ఎంత?

కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి.. మాస్క్ ను మించిన ఆయుధం లేదని నిపుణులు చాలా సార్లు చెప్పారు. ప్రభుత్వాలు కూడా మాస్క్ లు ధరించడంలో ఉండే రక్షణ గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూ వస్తున్నాయి.

Double Mask: డబుల్ మాస్కింగ్ అంటే ఏమిటి? ఎందుకు అలా చేయాలి? కరోనాను ఎదుర్కోవడంలో దాని ప్రభావం ఎంత?
Double Mask
KVD Varma
|

Updated on: Apr 23, 2021 | 7:44 PM

Share

Double Mask: కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి.. మాస్క్ ను మించిన ఆయుధం లేదని నిపుణులు చాలా సార్లు చెప్పారు. ప్రభుత్వాలు కూడా మాస్క్ లు ధరించడంలో ఉండే రక్షణ గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు మాస్క్ లేకపోతే కచ్చితంగా జరిమానాలు విధించే దిశలో హెచ్చరికలూ చేస్తున్నాయి. మాస్క్ రకం, వ్యక్తిగత మాస్కులు సంక్రమణను నివారించే దాని సామర్థ్యంపై అనేక నివేదికలు వచ్చాయి. ఇప్పుడు అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) మాస్క్ గురించి కొత్త విషయాన్ని వెల్లడించింది. ఒక మాస్క్ కాకుండా రెండు మాస్క్ లు (డబుల్ మాస్క్) ధరించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని సిడిసి నిపుణులు అంటున్నారు. దీనిని డబుల్ మాస్కింగ్ అంటారు. ఒక సర్జికల్ మాస్క్ పై భాగంలో ఒక క్లాత్ మాస్క్ కలిపి ధరించడం డబుల్ మాస్కింగ్ గా చెప్పొచ్చు. శరీరంలోకి సంక్రమణ బిందువులను నివారించడంలో ఇది 90 శాతానికి పైగా ప్రభావవంతంగా ఉంటుందని వారు చెబుతున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాధారణ పద్ధతిలో ధరించినప్పుడు సర్జికల్ మాస్క్ కరోనాను నివారించడంలో 56.1% ప్రభావవంతంగా ఉంటుంది. అదే సర్జికల్ మాస్క్ సాగే మరియు మడత అంచులను కట్టేటప్పుడు 77% ప్రభావవంతంగా ఉంటుంది. ఇక డబుల్ మాస్క్ కరోనా బిందువులను నివారించడంలో 85.4 శాతం ప్రభావవంతంగా ఉంటుంది.

డబుల్ మాస్క్ ఎప్పుడు ధరించాలి?

  • ఇంటి నుండి బయటకు వెళుతున్నపుడు
  • డాక్టర్(ఆసుపత్రి) దగ్గరకు వెళుతుననపుడు
  • ప్రయాణాలు చేయాల్సి వచ్చినపుడు
  • ఏదైనా రద్దీ ఉన్న ప్రదేశానికి వెళుతున్నప్పుడు
  • సామాజిక దూరాన్ని అనుసరించడం కష్టం అని భావించిన సమయంలోనూ

ఈ సమయాల్లో డబుల్ మాస్క్ దరించవద్దు.

  • మీరు ఇంట్లో ఉంటే, సాధారణ మాస్క్ సరిపోతుంది. ఇంట్లో డబుల్ మాస్క్ ధరించవద్దు
  • మీరు సామాజిక దూరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్న ప్రదేశానికి వెళుతుంటే, డబుల్ మాస్క్ ధరించవద్దు.
  • పిల్లలకు ఎటువంటి పరిస్థితిలోనూ డబుల్ మాస్క్‌లు ధరింపచేయవద్దు
  • n95 మాస్క్ కు మరో మాస్క్ కలిపి ఉపయోగించవద్దు
  • ఒక సర్జికల్ మాస్క్ పైన ఒక క్లాత్ మాస్క్ కలిపి వాడటం మంచింది.

మీరు ధరించిన మాస్క్ సరైనదేనా..

  • మీరు మాస్క్ ధరించాకా ఊపిరి పీల్చినపుడు ముక్కు దగ్గర మాస్క్ లోపలికి ప్రెస్ అవ్వాలి.
  • మీరు మాస్క్ ధరించాకా ఊపిరి వదిలినపుడు మీ కళ్ళద్దాలు ఆవిరితో నిండు తున్నాయంటే గాలి బయటకు వెళుతుందని అర్ధం
  • మీరు మాస్క్ పెట్టుకుని అద్దం ముందు నిలబడి గట్టిగా ఊపిరి వదలండి అప్పుడు మీ కను రెప్పలు కదిలాయి అంటే గాలి సక్రమంగా బయటకు వెళుతున్నట్టు.

Also Read: SBI Account: ఎస్‌బీఐ అకౌంట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్