Mask Over The Mask: మాస్క్‌పై మాస్క్ ధరించడం వల్ల మరింత రక్షణ.. ఎవరు చెప్పారో తెలుసా..
Mask Over The Mask: మాస్క్‌పై మాస్క్ ధరించడం వల్ల వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంటున్నారు.
Mask Over The Mask: మాస్క్‌పై మాస్క్ ధరించడం వల్ల వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంటున్నారు. మీరు అప్పటికే ఒక మాస్కుతో ముఖాన్ని కప్పి ఉంచితే దానిపై ఇంకో లేయర్ ఉండేలా చూసుకోండని అది మరింత బాగా పనిచేయనుందని అని ఫౌచీ ఓ షోలో భాగంగా వెల్లడించారు. ఈ విధానాన్ని డబుల్ మాస్కింగ్ అంటారని చెప్పారు. ఇప్పటికే కరోనా వల్ల మాస్క్ ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో తెలిసివచ్చింది.
మొదటి మాస్క్‌తో అక్కడక్కడా ఏవైనా ఖాళీలు మిగిలిపోతే, రెండో మాస్క్ వాటిని పూరిస్తుందని నిపుణులంటున్నారు. ఈ విధానం వల్ల శ్వాసించేప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ‘ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే వైరస్ వల్ల పాజిటివ్ రేటు మరింత పెరగనుందని అందుకే భౌతిక దూరం పాటించడం, ప్రయాణాలు తగ్గించడం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరని చెబుతున్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర ఇలా చేయడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
బ్రేకింగ్, ఢిల్లీలో మాస్కులు ధరించకపోతే భారీ జరిమానా ! రూ. 2 వేలు చెల్లించాల్సిందే !