North Korea President: అమెరికాను నమ్మలేం ఆయుధాలు పెంచుకుంటూనే ఉంటాం.. ఉత్తర కొరియా అధినేత కిమ్
North Korea President: ఉత్తర కొరియా అధ్యక్షుడు అగ్రరాజ్యం అమెరికా ప్రధాన భూభాగంపై అణు దాడులు చేయడానికి అభివృద్ధి చేసిన శక్తివంతమైన క్షిపణులను పరిశీలించారు. ఈ సందర్భంగా...
North Korea President: ఉత్తర కొరియా అధ్యక్షుడు అగ్రరాజ్యం అమెరికా ప్రధాన భూభాగంపై అణు దాడులు చేయడానికి అభివృద్ధి చేసిన శక్తివంతమైన క్షిపణులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికాపై సంచలన కామెంట్స్ చేశారు. తమ కొరియా ద్వీపంలో అమెరికావలనే అస్థిరత, యుద్ధవాతావరణం నెలకొంది అంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. తమ శత్రుదేశాలను ఎదుర్కొనేందుకు ఆరోజు రోజుకీ ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగా ఉత్తర కొరియా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర కొరియా సైన్యం ఆయుధ వ్యవస్థ ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదేశ అధ్యక్షుడు అమెరికాను నమ్మలేమని అన్నారు. అంతేకాదు తమకు దక్షిణ కొరియా పై దాడి చేసే ఉద్దేశయం లేదని తాము దక్షిణ కొరియాతో సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. అయితే తమ దేశంపై ఏ దేశం కూడా దాడి చేసి అవకాశం ఇవ్వమని.. అందుకనే తమ దేశ రక్షణ కోసం శక్తివంతమైన అణ్వాయుధాలు రూపొందించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
కొరియా ఉభయదేశాల్లో ఉద్రిక్తతలకు కారణం అమెరికా అంటూ కిమ్ జోంగ్ ఉన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్ ల మధ్య జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగియగా.. ఇటీవల కొత్త అధ్యక్షుడు జో బైడెన్ తాము ఉత్తర కొరియా అధినేత తో చర్చలు జరిపేందుకు సిద్ధం అంటూ సంకేతాలను పంపించింది. అయితే అమెరికా చర్చలకు పిలవడం అంటే.. తమ శత్రుత్వాన్ని కప్పి పుచ్చుకునే దుర్మార్గపు ఆలోచన అంటూ కిమ్ వ్యాఖ్యానించారు. అమెరికా తమపై ఆంక్షలు ఎత్తివేయాలని లేదా సియోల్లో సైనిక విన్యాసాలు ఆపాలని డిమాండ్ చేశారు.
అయితే ఓ వైపు దక్షిణ కొరియా వరస అణ్వయుధాల ప్రయోగాలపై ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారీగా నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తమపై ఉన్న ఆంక్షలను లెక్కచేయదని ఆ దేశ ప్రభుత్వం ఇటీవలే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణిని కూడా ప్రయోగించింది. తాజాగా ఉత్తర కొరియా చేపట్టిన ఆయుధ ప్రదర్శనపై దక్షిణ కొరియాలోని హన్నామ్ యూనివర్సిటీలో అధ్యాపకుడు మిలటరీ నిపుణుడు యాంగ్ వూక్ స్పందించారు. ఆయుధ ప్రదర్శనలో కనిపిస్తున్న ఫోటోలలోన్నీ కొన్ని ఆయుధాలు కొత్తవిగా కనిపిస్తున్నాయని తెలిపారు. సైనిక కవాతు నిర్వహిస్తున్న సమయంలో 11-యాక్సెల్ లాంచ్ వెహికల్‌పై అమర్చిన క్షిపణి ఉత్తరాన అతి పెద్దదైన ICBM అని చెప్పారు.
ఇక ప్రదర్శనలో ఉన్న ఇతర ఆయుధాలపై దక్షిణ కొరియా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్స్టిట్యూట్‌లోని క్షిపణి నిపుణుడు లీ చూన్ గ్యూన్ స్పందిస్తూ.. 2017 లో ఉత్తర కొరియా పరీక్షించిన జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు, భారీ నుంచి స్వల్ప క్షిపణులు లతో పాటు గత నెలలో అభివృద్ధి చేసిన హైపర్‌సోనిక్ క్షిపణి ఉన్నాయని అన్నారు.
Also Read: రెండు తలలతో వింత లేగ దూడ జననం.. దుర్గాదేవి అవతారంగా పూజలు ఎక్కడంటే..