AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: ‘నీలిరంగు రాయి’ ఇచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేసిన చిన్నారి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న పోస్ట్

Viral Post: పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే ..అని ఓ సినీ కవి అన్నట్లు.. పిల్లలకు మోసం- ద్వేషం, మంచి చెడు.. ఇలా ఏమీ తెలియవు.. స్వచ్ఛమైన మనసుతో..

Viral Post: 'నీలిరంగు రాయి' ఇచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేసిన చిన్నారి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న పోస్ట్
Viral Post
Surya Kala
|

Updated on: Oct 12, 2021 | 8:16 PM

Share

Viral Post: పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే ..అని ఓ సినీ కవి అన్నట్లు.. పిల్లలకు మోసం- ద్వేషం, మంచి చెడు.. ఇలా ఏమీ తెలియవు.. స్వచ్ఛమైన మనసుతో ప్రకృతి లో వికసించిన పువ్వుల్లా కనిపిస్తారు. అందరినీ ఆకర్షిస్తారు. తాజాగా  బ్లూ కలర్ లో ఉన్న రాతిని పట్టుకున్న ఫోటోని ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. అంతేకాదు ఆ ఫోటో కి తానూ ఇప్పుడు ” నీలి రంగు రాయి కలిగిన ధన వంతుడిని అంటూ ” కామెంట్ కూడా జత చేశాడు. నెటిజన్ల మనసు దోచుకున్న పోస్టు గురించి వివరాల్లోకి వెళ్తే..

ఐస్ క్రీమ్ అమ్ముతున్న సమయంలో ఓ చిన్నారి ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వచ్చిందని ఆండ్రూ హిల్లరీ చెప్పాడు. అప్పుడు ఆ చిన్నారి చేతిలో ఓ నీలి రంగు రాయి ఉంది. ఆ రాయిని నా చేతిలో పెట్టి.. ఇది నాకు దొరికింది. దీనిని మీకు ఇస్తే.. నాకు ఐస్ క్రీమ్ ఇస్తారా అంటూ అమాయకంగా ప్రేమగా ఆ చిన్నారి అడిగింది. దీంతో నేను ఆ చిన్నారి దగ్గర నుంచి ఆ నీలి రంగు రాయిని తీసుకుని ఐస్ క్రీమ్ ఇచ్చాను. కనుక ఇప్పుడు నేను నీలి రంగు రాయి ఉన్న ధనవంతుడిని అంటూ చెప్పాడు.

అయితే ఫోటో తో పాటు.. తాను ఇలా ఐస్ క్రీమ్ ను డబ్బులకు బదులు నీలి రంగు రాయికి ఇచ్చినట్లు తన యజమానికి చెప్పవద్దు అంటూ తనలోని కామెడీ సెన్స్ ను కూడా బహిర్గతం చేశాడు ఆండ్రూ హిల్లరీ. ఈ పోస్టు నెటిజన్ల మనసు దోచుకుంది.  భారీ స్పందన వస్తుంది. 7.4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.   “పిల్లలు చాలా అమాయకులు,  కొందరు పెద్దలు చాలా దయగలవారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు డబ్బు కోసం ఆశించకుండా ఆ పసి మనసుని సంతోష పెట్టిన నువ్వు దయగల వ్యక్తివి అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: North Korea President: అమెరికాను నమ్మలేం ఆయుధాలు పెంచుకుంటూనే ఉంటాం.. దక్షిణ కొరియా అధినేత కిమ్