అణ్వాయుధాలు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతం చేస్తాం.. హెచ్చరించిన సౌత్ కొరియా అధ్యక్షుడు
వరుసగా క్షిపణి ప్రయోగాలను అలాగే.. కవ్వింపు చర్యలతో ప్రస్తుతం ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. దక్షిణ కొరియా సేనలు సియోల్ వీధుల్లో రంగంలోకి దిగాయి. 75వ ‘సాయుధ బలగాల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించినటువంటి సైనిక కవాతులో భాగంగా పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం అందరిని ఆకట్టుకుంది. అయితే ఇలాంటి స్థాయిలో ఇలా ప్రదర్శన చేయడం పది సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే ఉత్తర కొరియా ఆగడాలను కట్టడి చేయడానికి పటిష్ఠమైనటువంటి సైన్యాన్ని నిర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఈ సందర్భంగా వివరించారు.
వరుసగా క్షిపణి ప్రయోగాలను అలాగే.. కవ్వింపు చర్యలతో ప్రస్తుతం ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. దక్షిణ కొరియా సేనలు సియోల్ వీధుల్లో రంగంలోకి దిగాయి. 75వ ‘సాయుధ బలగాల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించినటువంటి సైనిక కవాతులో భాగంగా పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం అందరిని ఆకట్టుకుంది. అయితే ఇలాంటి స్థాయిలో ఇలా ప్రదర్శన చేయడం పది సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే ఉత్తర కొరియా ఆగడాలను కట్టడి చేయడానికి పటిష్ఠమైనటువంటి సైన్యాన్ని నిర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఈ సందర్భంగా వివరించారు. అలాగే ఉత్తర కొరియా అణు ఆయుధాలను ప్రయోగించినట్లేతే.. అమెరికాతో కలిసి కిమ్ జోంగ్ ఉన్ పాలనను అంతం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే యుద్ధ ట్యాంకులు, ఫిరంగి సిస్టంలు, డ్రోన్లు, ఉత్తర కొరియాలోని ఎక్కడికి వెళ్లినా కూడా చేరుకోగల శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులు, అలాగే మిగతా ఆయుధ వ్యవస్థలను దక్షిణ కొరియా ప్రదర్శించింది.
అలాగే వేలాది మంది సైనికులు రైఫిళ్లు, జెండాలతో అక్కడ జరిగినటువంటి పరేడ్‌లో పాల్గొన్నారు. దాదాపు 300 మంది అమెరికన్ సైనికులూ ఈ పరేడ్‌లో భాగమయ్యారు. ఇదిలా ఉండగా.. 2013 తర్వాత ఇదే అతిపెద్ద మిలిటరీ పరేడ్ అని స్థానిక అధికారులు వివరించారు. అయితే శత్రువుల్లో భయాన్ని పుట్టించేటటువంటి బలమైన మిలిటరీని నిర్మించేందుకు కృషి చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు యోల్ ఈ సందర్భంగా మాట్లాడారు. అయితే ఉత్తర కొరియా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లైతే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. ఒకవేళ అణు ఆయుధాలను గనుక ప్రయోగించినట్లైతే.. దక్షిణ కొరియా- అమెరికా కూటమి ప్రతిస్పందన వల్ల కిమ్ జోంగ్ ఉన్ పాలన అంతం అవుతుందని వ్యాఖ్యానించారు. అలాగే గత ఏడాది అధికారం చేపట్టినటువంటి యూన్ సుక్ యోల్.. దక్షిణ కొరియా సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచడానికి, బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.
అయితే ఉత్తర కొరియాను ఎదుర్కొనేందుకు.. అలాగే దాని అణు ఆయుధ ఆశయాలను నిలువరించేందుకుగానూ అమెరికాతో పాటుగా సైనిక కసరత్తులను విస్తరిస్తున్నారు. అలాగే మరోవైపు చూసుకుంటే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలే రష్యాలో పర్యటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇది అమెరికాతో పాటుగా ఆ దేశ మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా చేయడం.. అలాగే ఇందుకు ప్రతిఫలంగా కిమ్ జోంగ్ ఉన్ చేపట్టే క్షిపణి కార్యక్రమాలకు రష్యా సాయం అందేలా ఒప్పందాలు జరుగుతాయేమోనని అనుమానం కూడా వ్యక్తం చేశాయి అమెరికా మిత్రదేశాలు. అయితే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇలాంటి ఒప్పందాలను గనుక చేసుకున్నట్లైతే ఊరుకునేది లేదని.. యూన్ సుక్ యోల్ ఇప్పటికే స్పష్టం చేశారు.