ఇండియాలో సైనిక సంబంధాలకు ఎలాంటి ఢోకా ఉండదు: కెనడా సైనికాధికారి

కెనడా ప్రధానమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొంత మేరకు దౌత్యపరంగా కూడా సంబంధాలు దెబ్బతిన్న విషయం కూడా వాస్తవమే. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలకు మాత్రం ఎటువంటి ఢోకా ఉండదని చెబుతున్నారు కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్. అయితే భారత్ వేదికగా జరుగుతున్నటువంటి ఇండో పసిఫిక్ సైన్యాధ్యక్షుల సదస్సులో పాల్గొనడానికి సుమారు 30 దేశాల సైన్యానికి చెందిన ప్రతినిధులు వచ్చారు.

ఇండియాలో సైనిక సంబంధాలకు ఎలాంటి ఢోకా ఉండదు: కెనడా సైనికాధికారి
Canadian Army Vice Chief Peter
Follow us
Aravind B

|

Updated on: Sep 26, 2023 | 9:02 PM

కెనడా ప్రధానమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొంత మేరకు దౌత్యపరంగా కూడా సంబంధాలు దెబ్బతిన్న విషయం కూడా వాస్తవమే. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలకు మాత్రం ఎటువంటి ఢోకా ఉండదని చెబుతున్నారు కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్. అయితే భారత్ వేదికగా జరుగుతున్నటువంటి ఇండో పసిఫిక్ సైన్యాధ్యక్షుల సదస్సులో పాల్గొనడానికి సుమారు 30 దేశాల సైన్యానికి చెందిన ప్రతినిధులు వచ్చారు. అలాగే ఈ సదస్సుకు కెనడా డిప్యూటీ ఆర్మీ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ సైతం హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగానే ఆయన విలేకర్ల సమావేశంలో కొద్దిసేపు మాట్లాడారు. ఇక పీటర్ స్కాట్ వ్యాఖ్యానిస్తూ.. ప్రస్తుతం భారత్‎లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అలాగే కెనడా-ఇండియాల మధ్య జరుగుతున్నటువంటి వివాదానికి ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొ్న్నారు. అలాగే నాకు తెలిసినంతవరకు ఆ సమస్య రాజకీయ అనేది ఆ స్థాయిలోనే పరిష్కారమవ్వాలని కోరుతున్నామని.. అందులో నుంచి మేము జోక్యం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మా ప్రధాన మంత్రి కూడా ఆ విషయాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లోనే ప్రస్తావనకు తీసుకువచ్చారని.. ప్రస్తుతం దానిపై విచారణ కూడా కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారని.. ఇండియా సహకరించినట్లైతే దర్యాప్తు తొందరగా జరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. అలాగే ఆ సమస్య కూడా రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను ఎంతవరకు ప్రభావితం చేయదని పేర్కొన్నారు. అలాగే భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కూడా ముందురోజు మాట్లాడినట్లు.. అలాగే ఆ సమస్య రాజకీయ స్థాయిలోనే పరిష్కారం కావాలని దాని వల్ల సైనిక సంబంధాలకు ఎలాంటి భంగం అనేది కలగకూడదని తామిద్దరం తీర్మానించుకున్నట్ల పేర్కొన్నారు.అంతేకాదు ఈ సదస్సులో ఎవైన కఠిన పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కొంటున్న ఇండో-పసిఫిక్ దేశాలకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి