ఆరేళ్ల తర్వాత చైనా పర్యటనకు ఉత్తర కొరియా సుప్రీం.. అమెరికా గుండెల్లో గుబులు షురూ
చైనా తన అతిపెద్ద సైనికశక్తిని ప్రపంచం ముందు ప్రదర్శించబోతోంది. చైనా-జపనీస్ యుద్ధం 80వ వార్షికోత్సవం, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా బీజింగ్‌లో గ్రాండ్ విక్టరీ పరేడ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ముగ్గురు కీలక నాయకులు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ హాజరవుతున్నారు.

చైనా తన అతిపెద్ద సైనికశక్తిని ప్రపంచం ముందు ప్రదర్శించబోతోంది. చైనా-జపనీస్ యుద్ధం 80వ వార్షికోత్సవం, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా బీజింగ్‌లో గ్రాండ్ విక్టరీ పరేడ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ముగ్గురు కీలక నాయకులు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ హాజరవుతున్నారు.
ప్రత్యేకత ఏమిటంటే కిమ్ జోంగ్ మొదటిసారిగా అంతర్జాతీయ అగ్రనాయకులతో వేదికనున పంచుకోబోతున్నారు. సెప్టెంబర్ 3న సైనిక కవాతు జరుగుతుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మొత్తం 26 దేశాల దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కవాతు అగ్ర రాజ్యం అమెరికాను కాస్త టెన్షన్ పెట్టిస్తోంది. అమెరికాకు మిత్రుడైన ఉత్తర కొరియా సుప్రీం కిమ్ జోంగ్ ఈ పరేడ్‌కు హాజరవుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఆరేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పర్యటించనున్నట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కిమ్ జోంగ్ ఉన్ తన బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనా చేరుకున్నారు. ఈ పర్యటనకు ముందు కిమ్ జోంగ్ ఉన్ ఒక కొత్త ఆయుధ కార్మాగారాన్ని సందర్శించారన్న వార్త ఆసక్తి రేపుతోంది. భారీ స్థాయిలో క్షిపణుల నిర్మాణాన్ని చేపట్టాలన్న లక్ష్య సాధన కోసం కిమ్ జోంగ్ ఈ కర్మాగారాన్ని స్థాపించారు. చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న జగాంగ్ రాష్ట్రంలో ఈ పరిశ్రమ ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ కవాతు విజయ దినోత్సవం పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా తన కొత్త సైనిక శక్తిని ప్రదర్శించబోతోంది. ఇందులో వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు ఉంటాయి. మొదటిసారిగా, చైనా సైన్యం కొత్త నిర్మాణం కవాతులో పూర్తిగా ప్రదర్శించబోతుంది.
ఈ పరేడ్ టియానన్మెన్ స్క్వేర్‌లో జరుగుతుంది. ఈ కవాతులో పదివేల మంది సైనికులు కవాతు చేస్తూ కనిపిస్తారు. చైనా సైన్యంలోని 45 యూనిట్ల సైనికులతో పాటు, యుద్ధ అనుభవజ్ఞులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కవాతు దాదాపు 70 నిమిషాల పాటు ఉంటుంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ స్వయంగా దీనికి నాయకత్వం వహిస్తారు. బీజింగ్ పరేడ్‌లో పుతిన్ మరియు జి జిన్‌పింగ్‌తో కలిసి కిమ్ జోంగ్ ఉన్ నిలబడటం కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, చైనాకు పెద్ద దౌత్య విజయంగా పరిగణిస్తున్నారు. దాని సమయం కూడా చాలా ముఖ్యం. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు.
1. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం పుతిన్‌తో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల, ఆయన కిమ్‌ను మళ్ళీ కలవాలనే కోరికను కూడా వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితిలో, కవాతు ద్వారా, జి జిన్‌పింగ్ ఈ మొత్తం ఆటకు తన వద్ద కీలకం ఉందని సందేశాన్ని ఇస్తున్నారు. పుతిన్-కిమ్ ఇద్దరు చైనాతో కలిసి ఉండటం కొంత ప్రభావం చూపుతుంది.
2. అక్టోబర్ చివరలో ట్రంప్ ఆసియాలో పర్యటించవచ్చని, జి జిన్‌పింగ్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ ఇప్పటికే సూచించింది. కానీ ఇప్పుడు జి జిన్‌పింగ్ కిమ్-పుతిన్‌లతో నేరుగా చర్చలు జరపడం ద్వారా అమెరికాతో జరిగే ఏ సమావేశంలోనైనా చాలా బలమైన స్థితిని తెలియజేయబోతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
