ఎన్నారైలను కలిసిన కేంద్ర మంత్రి సింధియా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యం అంటూ ప్రశంసలు.. ఎందుకంటే..

జర్మనీలో జరుగుతున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో మొదటి రోజు జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఆయన ఎన్నారైలతో పలు విషయాలపై మాట్లాడారు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మన దేశంలోని ప్రతి పౌరుడికి అసాధ్యాలను సుసాధ్యం చేసే సామర్థ్యం ఉందని అన్నారు.

ఎన్నారైలను కలిసిన కేంద్ర మంత్రి సింధియా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యం అంటూ ప్రశంసలు.. ఎందుకంటే..
News9 Global Summit
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2024 | 8:48 PM

జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగుతున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ దేశంలో స్థిరపడిన ప్రవాస భారతీయులతో జ్యోతిరాదిత్య సింధియా సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్‌తో సహా అనేక రాష్ట్రాలకు చెందిన భారతీయులు జర్మనీలో నివసిస్తున్నారు. ఈ ఎన్నారైలతో జరిగిన భేటీలో జరిగిన ‘భావోద్వేగ సంభాషణ’ వీడియోను సింధియా షేర్ చేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేసే సామర్థ్యం మన దేశంలోని ప్రతి పౌరుడికి ఉందనే అన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాస భారతీయులు స్టట్‌గార్ట్‌తో సహా జర్మనీలోని ఇతర నగరాల్లో స్థిరపడిన తమ గురించి.. తమ ఐక్యత గురించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు చెప్పారు. జర్మనీలోని ఎన్నారైలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్చన రాథోడ్ మాట్లాడుతూ.. 2022లో స్వాతంత్య్ర అమృత్ మహోత్సవం జరుపుకున్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని.. అప్పుడు తాము కూడా తమ ఇళ్ళలో జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించుకున్నామని అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఆగష్టు 15న స్వాతంత్య దినోత్సవ వేడుకలను తాము జరుపుకుంటామని ఎన్నారైలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

స్టట్‌గార్ట్‌లో ‘భారత కుటుంబాన్ని’ సృష్టించామన్న ఎన్నారైలు

అర్చన రాథోడ్.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడుతూ… ఆగస్టు 15వ తేదీని పండగలా ఉత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. జర్మనీలో నివసిస్తున్న ఎన్నారైలందరిని కలిపి ఉంచేలా ‘ఇండియన్ ఫ్యామిలీ’ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి తాము అంతా కష్టపడి ‘భారతీయ కుటుంబాన్ని స్థాపించామని చెప్పారు. స్టుట్‌గార్ట్‌తో మొదలు పెట్టిన ఈ సంక్పలం.. ఇప్పుడు జర్మనీ దేశ వ్యాప్తం అయిందని న్నారు. జర్మనీలోని చాలా మంది భారతీయులు మొదటి తరానికి చెందిన వారు నుంచి ప్రతి ఒక్కరూ ఈ భారతీయ కుటుంబంలో ఒక్కరుగా మారారు. ప్రస్తుతం స్టుట్‌గార్ట్‌తో పాటు మొత్తం జర్మనీలో ‘భారతీయ కుటుంబం’ ఏర్పడిందని చెప్పారు.

అదే సమయంలో ఒక ప్రవాస భారతీయుడు 2022 నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ.. తాము 2022 లో ఆగస్టు 15న అమృత్ మహోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. స్థానిక పరిపాలన అధికారులు ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు అప్పటి జర్మన్ ఛాన్సలర్‌ను కలిసి.. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్రమోడీని చూపించగా, వెంటనే జర్మనీ అధికారులు అమృత్ మహోత్సవం జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. ఈ సంఘటన గురించి విన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ప్రతి భారతీయుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడని ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటాం..

ఇదే సమయంలో ఎన్నారైలు మాట్లాడుతూ ఇప్పుడు మాకు అన్ని విధాలుగా సహాయపడే ‘భారతీయ కుటుంబం’ ఉంది. ఈ కుటుంబంలో భారతదేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారు, అర్చకులు, కార్పొరేట్లలో పనిచేసే వ్యక్తులు, ఒడిశా, కేరళ సహా అనేక ప్రాంతాల నుంచి రకరకాల వృత్తికి చెందిన వారు ఉన్నారు. తాము చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సమస్యను ఒకరికొకరం సాయం చేసుకుంటూ పరిష్కరించుకుంటామని చెప్పారు. జర్మనీ దేశంలో తాము ఏర్పాటు చేసుకున్న భారతీయ కుటుంబం గురించి ప్రధాని మోడీకి చెప్పాలి. ఇదే విధంగా ఇతర దేశాల నుంచి వలన వచ్చిన వారు కూడా తమ కుటుంబాలను సృష్టించుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఎన్నారైన సహకారం మరువలేదన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య

ఎన్నారైలతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం, కృషి కారణంగా.. మొదటిసారిగా భారతీయులందరి హృదయాలలో భారతీయులం అనే భావన వెలుగులోకి వచ్చిందని అన్నారు. మీరు మాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు.. ఈ రోజు మన దేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందంటే.. దానికి అతిపెద్ద కారణం ప్రవాస భారతీయులే అని చెప్పారు. అంతేకాదు ఈ రోజు భారతదేశం పేరు ప్రపంచ వేదికపై ఉంటే.. అందులో ఎన్నారైల సహకారం మరువలేదని అన్నారు.

మీరు భారత రాయబారులు

అంతేకాదు ఎన్నారైల గురించి ఇంకా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. మీరు భారతదేశానికి రాయబారులని.. ప్రతి దేశంలో ఎన్నారై ఒక ఆస్తిలా మారతారని.. ఏ దేశంలోనైనా ఎన్నారై ఆ దేశానికి రాజధానిగా మారతాడు.. అదే గొప్ప గొప్పతనం.. భారతీయత అని ప్రశంసల వర్షం కురిపించారు జ్యోతిరాదిత్య సింధియా. దీని తరువాత జ్యోతిరాదిత్య సింధియా 55 సంవత్సరాలుగా జర్మనీలో నివసిస్తున్న ఎన్నారైని కలిశారు

మరిన్ని న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ