నేపాల్ లో మళ్ళీ రాజకీయ సంక్షోభం, పార్లమెంటును రద్దు చేసిన ప్రెసిడెంట్, నవంబరు 12 న తొలిదశ సార్వత్రిక ఎన్నికలు,
నేపాల్ లో మళ్ళీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటును ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీ రద్దు చేశారు. నవంబరు 12 న మొదటి దశ , 19 న రెండో దశ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది.
నేపాల్ లో మళ్ళీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటును ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీ రద్దు చేశారు. నవంబరు 12 న మొదటి దశ , 19 న రెండో దశ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ఆపద్ధర్మ ప్రధాని కె.పి.శర్మ ఓలి గానీ,, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవ్ బా గానీ శుక్రవారం కల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభను ప్రెసిడెంట్ రద్దు చేసినట్టు ఇందులో స్పష్టం చేశారు. ఆపద్ధర్మ ప్రధాని ఓలి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ చేసిన సిఫారసు మేరకు ప్రెసిడెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఓలి గత ఏడాది డిసెంబరులో పార్లమెంటును రద్దు చేశారు. దీంతో అప్పటికే నేపాల్ లో రాజకీయ సంక్షోభం మొదలైంది. ప్రచండ నేతృత్వంలోని పార్టీ ఆయన ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోగా/ప్రతినిధుల సభలో ఓలి మెజారిటీని నిరూపించుకోవాల్సి వచ్చింది. కానీ ఆ విశ్వాస పరీక్షలో ఆయన ఓడిపోయారు.అంతకుముందే పార్లమెంటును ఓలి రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంది.
ఇలా ఉండగా ప్రెసిడెంట్ తీసుకున్న చర్యపై రాజకీయ పార్టీలు ఇంకా స్పందించలేదు. మరోవైపు దేశంలో రెండో దశ కోవిద్ బలంగా ఉంది. కేసులు సగటున రోజూ 8,207 కి పైగా నమోదవుతున్నాయి. ఖాట్మండు లోని ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒకే బెడ్ పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చపాతీలు ఇలా కూడా చేస్తారా..?? ఈ స్టైల్ చూసి ఫిదా ఆయన నెటిజన్లు.. ( వీడియో )
Viral Video: పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ.. వైరల్గా మారిన వీడియో...
Viral Video: ఆఫీసులో బుస బసలు.. అధికారులకు చుక్కల చూపించిన కొండచిలువ..!! ( వీడియో )