AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wright Brothers: రైట్ సోదరుల విమానానికి పేటెంట్ కోసం మూడేళ్ళు పట్టింది.. ఎందుకో తెలుసా?

Wright Brothers: పక్షిలా ఎగిరిపోతే ఎంత బావుంటుంది అని మనిషి ఎప్పుడూ అనుకునేవాడు. దానిని నిజం చేసిన వారు రైట్ సోదరులు. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో దెబ్బలు ఈ ప్రయత్నంలో వారు ఎదుర్కున్నారు.

Wright Brothers: రైట్ సోదరుల విమానానికి పేటెంట్ కోసం మూడేళ్ళు పట్టింది.. ఎందుకో తెలుసా?
Wright Brothers
KVD Varma
|

Updated on: May 22, 2021 | 10:37 AM

Share

Wright Brothers: పక్షిలా ఎగిరిపోతే ఎంత బావుంటుంది అని మనిషి ఎప్పుడూ అనుకునేవాడు. దానిని నిజం చేసిన వారు రైట్ సోదరులు. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో దెబ్బలు ఈ ప్రయత్నంలో వారు ఎదుర్కున్నారు. వారు గాలిలో ఎగిరే విమానాన్ని కనిపెట్టినా ఆ ఘనతను వారికి ఇవ్వడానికి అప్పట్లో ఎవరూ అంగీకరించలేదు. వారు కనిపెట్టిన గాలిలో ఎగిరే మిషన్ ను చూసి ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. అన్నిటినీ తీర్చిన రైట్ సోదరులు చివరికి తాము అనుకున్నది సాధించారు. రైట్ సోదరులకు విమానంపై పేటెంట్ హక్కు లభించిన రోజు ఈరోజు (మే 22). నిజానికి వారు విమానాన్ని కనిపెట్టింది 17 డిసెంబర్ 1903 తేదీన. కానీ, దానికి పేటెంట్ మాత్రం మూడేళ్ళ తరువాత అంటే 1906 లో మే 22 న దానికి పేటెంట్ పొంద గలిగారు. ఈ ఆలస్యం వెనుక పెద్ద కథే నడిచింది. ముందు రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిన వెంటనే.. పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. దానిపై ఒక ఫ్రెంచి సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సవాలు చేసింది. దానిని రైట్ సోదరులు కష్టపడి ఎదుర్కుని ఫ్రెంచి వాదనలను తప్పు అని నిరూపించారు. తరువాత అడ్డంకి అమెరికా మిలటరీ నుంచి వచ్చింది. అప్పట్లో అమెరికా మిలిటరీ కూడా విమానాల తయారీకోసం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రైట్ సోదరుల పేటెంట్ వాదనలు తిరస్కరించారు. అయితే, వారు పట్టు వదలలేదు. తమ ప్రయత్నాలను మానలేదు. పేటెంట్ కు సంబంధించి ఎదురైన అన్ని ప్రశ్నలకూ వాళ్ళు సమాధానం ఇచ్చారు. దీంతో చివరికి 1906 లో మే 22 న వారికి పేటెంట్ ఇచ్చారు. మొదటి విమానానికి రైట్ సోదరులు పొందిన పేటెంట్ ఇదే..

Wright Patent

Wright Patent

మొదట విమానం కనిపెట్టింది భారతీయుడే!

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి. నిజానికి రైట్ సోదరుల కంటె ముందే భారతదేశంలో విమానం తయారు చేశారని చెబుతారు. రైట్ సోదరులు తమ విమానాన్ని కనుక్కోవడానికి ఎనిమిదేళ్ళ ముందు 1895లోనే భారతదేశంలో విమానం తయారు చేశారని చరిత్రకారులు చెబుతారు. శివకర్ బాపూజీ తల్పాడే అనే భారతీయ పౌరుడు ముంబైలోని చౌపట్టి సమీపంలో బహిరంగంగా ఒక విమానంలో ప్రయాణించాడని వారు చెప్పారు. అతను తయారు చేసిన విమానానికి మారుత్సాఖా అని పేరుపెట్టారు. ఇది అప్పటి బరోడా మహారాజా సర్ శివాజీ రావు గైక్వాడ్, లాల్జీ నారాయణుల ముందు ప్రదర్శించారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన దేశంలో తయారు చేసిన ఈ విమానం 1500 అడుగుల ఎత్తు వరకూ వెళ్ళింది. అదే ఎనిమిదేళ్ళ తరువాత రైట్ సోదరులు కనిపెట్టిన విమానం 120 అడుగుల ఎత్తు మాత్రమే ఎగిరింది. తరువాత మన దేశంలో కనిపెట్టిన విమాన ప్రయత్నాలు ఆగిపోయాయి. కానీ, రైట్ సోదరులు మాత్రం పట్టుదలతో తమ ప్రయత్నాన్ని విజయవంతం చేసుకున్నారు.

ఏది ఏమైనా మనిషి గాలిలోకి ఎగరాలి అనే కలను సాకారం చేసిన ఘనత మాత్రం రైట్ సోదరుల సొంతం అయిపోయింది.

Also Read: Dogs Sniffing Corona : కరోనా సోకిన వారిని పసిగడుతున్న శునకాలు..! సెకన్ల వ్యవధిలో ఫలితాలు తేల్చేస్తున్నాయి.. ఎక్కడో తెలుసా..?

Viral Video : పాకిస్తాన్‌లో పిల్లలపై దాడి చేసిన సింహం..! క్రూర జంతువని తెలిసి అలా చేశారు.. వైరల్‌గా మారిన వీడియో..