AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: గుడ్‌న్యూస్‌.. ఆ టీకాలతో మంకీపాక్స్‌కు ముకుతాడు వేయచ్చు: మెల్‌బోర్న్‌ సైంటిస్టులు

కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగుకాకుండానే మరో మహమ్మారి అందరికీ కంటి మీద కునుకులేకుండా చేసింది. ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలను వణికించింది. అదే మంకీపాక్స్‌ వైరస్‌. ఇప్పటివరకు సుమారు 90 దేశాల్లో 52 వేలకు పైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి.

Monkeypox: గుడ్‌న్యూస్‌.. ఆ టీకాలతో మంకీపాక్స్‌కు ముకుతాడు వేయచ్చు: మెల్‌బోర్న్‌ సైంటిస్టులు
Monkeypox
Basha Shek
|

Updated on: Sep 10, 2022 | 12:26 PM

Share

కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగుకాకుండానే మరో మహమ్మారి అందరికీ కంటి మీద కునుకులేకుండా చేసింది. ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలను వణికించింది. అదే మంకీపాక్స్‌ వైరస్‌. ఇప్పటివరకు సుమారు 90 దేశాల్లో 52 వేలకు పైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇండియాలోనూ మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. అయితే కేంద్ర, రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రస్తుతం ఈ మహమ్మారి నియంత్రణలోనే ఉంది. అయితే ఈ వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు పలు దేశాల పరిశోధకులు, శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో మంకీపాక్స్‌ వైరస్‌కు వ్యాక్సీనియా వైరస్‌ (VACV) ఆధారిత టీకాలు సమర్థంగా ముకుతాడు వేయగలవంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు. బాధితుల్లో బలమైన రోగనిరోధక శక్తిని అవి ఉత్పత్తి చేయగలుగుతున్నట్లు తేల్చారు.

‘వ్యాక్సీనియా వైరస్‌ అనేది పాక్స్‌ వైరస్‌ కుటుంబానికి చెందిన ఓ పెద్ద, సంక్లిష్టమైన వైరస్‌. దాని ఆధారిత వ్యాక్సిన్లు గతంలో మంకీపాక్స్‌పై సమర్థవంతంగా పనిచేశాయి. కాగా కొంతకాలంగా ఎంపీఎక్స్‌వీ-2022 అనే రకం వైరస్‌ కారణంగా మంకీపాక్స్‌ వ్యాప్తిచెందుతోంది. దీనిపై వీఏసీవీ టీకాల ప్రభావం ఎంతమేరకు పనిచేస్తుదన్న విషయంపై పరిశోధనలు నిర్వహించాం. ఇందులో ఎంపీఎక్స్‌వీ-2022 వైరస్‌ను వీఏసీవీ టీకాలు సమర్థంగా గుర్తించాయి. రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా అప్రమత్తం చేశాయి’ అని మెల్‌బోర్న్‌ పరిశోధకులు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..