బంగ్లాదేశ్‌లో చల్లారని హింస.. హిందూ ఇళ్లను తగలబెట్టిన దుండగులు..!
బంగ్లాదేశ్‌లో హిందువులపై వేధింపులు ఆగకుండా కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ చిట్టగాంగ్‌లో అనేక హిందూ ఇళ్లను తగులబెట్టడాన్ని చూపించే వీడియోను విడుదల చేశారు. మంగళవారం (డిసెంబర్ 23) జరిగిన ఈ ఘటనలో ఆస్తి నష్టం తోపాటు కుటుంబంలోని పెంపుడు జంతువులు మరణించాయి. ఇంట్లోని కుటుంబసభ్యులు రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటనలో బాధితులను జయంతి సంఘ, బాబు శుకుశీల్‌గా గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో కుటుంబం వారి ఇంటి లోపల ఉంది. అన్ని తలుపులు మూసి ఉండటంతో కుటుంబం కంచెను చీల్చుకుని మంటల నుండి తప్పించుకోవలసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
అగ్నిప్రమాదంలో ఏడేళ్ల బాలిక సజీవ దహనం
ఇదిలావుంటే, డిసెంబర్ 19వ తేదీ రాత్రి, కొంతమంది దుండగులు లక్ష్మీపూర్ సదర్‌లోని ఒక ఇంటికి బయటి నుండి తాళం వేసి, దానిపై పెట్రోల్ పోసి, నిప్పంటించారు. ఈ మంటల్లో 7 ఏళ్ల బాలిక సజీవ దహనం కావడంతో మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా కాలిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జరిగింది. 7 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మరణించింది.
దీపును హత్య చేసి సజీవ దహనం
డిసెంబర్ 18న, ఢాకా సమీపంలోని భలుకాలో హిందూ యువకుడు దీపు చంద్రను కొట్టి చంపారు. దాడి చేసిన తర్వాత అతన్ని చెట్టు వేలాదీసి సజీవ దహనం చేశారు. దీపు ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసేవాడు. దీపు ఫేస్‌బుక్‌లో మతపరమైన భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను పోస్ట్ చేశాడని ఆరోపించారు. కానీ దర్యాప్తులో అలాంటి వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఫ్యాక్టరీలో పని విషయంలో జరిగిన వివాదం ఫలితంగా ఈ హత్య జరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..