AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

California Wildfire: మంటల్లో బూడిదైన 3600 ఇళ్లు.. మైళ్ల దూరం కొద్ది వ్యాపిస్తున్న భారీ మంటలు

California Wildfire: కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఇళ్లూ వాకిళ్లను తగలబెడుతోంది.. వేలాది మందిని ఇళ్లనొదిలి పారిపోయేలా చేసింది. ఇంతకీ ఇక్కడి కార్చిచ్చుకు కారణమేంటి..

California Wildfire: మంటల్లో బూడిదైన 3600 ఇళ్లు.. మైళ్ల దూరం కొద్ది వ్యాపిస్తున్న భారీ మంటలు
Wildfire
Subhash Goud
|

Updated on: Sep 10, 2022 | 7:21 AM

Share

California Wildfire: కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఇళ్లూ వాకిళ్లను తగలబెడుతోంది.. వేలాది మందిని ఇళ్లనొదిలి పారిపోయేలా చేసింది. ఇంతకీ ఇక్కడి కార్చిచ్చుకు కారణమేంటి? కాలిఫోర్నియా అడవులను కార్చిచ్చు కకావికలం చేస్తోంది. ఈ మంటలను అదుపులో పెట్టడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తీవ్ర వేడిమి కారణంగా.. ఈ మంటలు ఒక పేలుడుతో సమానంగా ప్రజ్వరిల్లుతున్నాయ్. రాష్ట్రానికి రెండు వైపులా.. ఉన్న కొండ ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తరాన ఉన్న సియర్రా నెవేడ, మస్కిటో ఫైర్ తీవ్రమైన మంటల తాకిడికి గురయ్యాయి. ఇరవై చదరపు మైళ్ల మేర అగ్నికి ఆహుతయ్యాయి.. మస్కిటో ఫైర్ లో 3600 ఇళ్లు ఈ మంటలకు ప్రభావితం కాగా, ఎల్ డొరాడో కౌంటీస్ పై పొగ దుప్పటి కమ్మేసింది. అయితే గడిచిన 24 గంటల్లో మంటలు మూడు రేట్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 1100 మంది అగ్నిమాపక సిబ్బంది విమానాలు, అగ్నిమాపక శకటాల ద్వారా మంటలను ఆర్పుతున్నారు. ఈ కార్చిచ్చులో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదే కాదు.. కాలిఫోర్నియా మరికొన్ని వాతావరణ హెచ్చరికలను ఎదుర్కుంటోంది. తీవ్ర వేడిమి రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ ను దారుణంగా దెబ్బ తీసింది. ఉష్ణమండల తుఫాను ఉరుములు మెరుపులతో కూడిన తేమ వాతావరణాన్ని పెపొందించే అవకాశం కనిపిస్తోంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పంలో ఉష్ణమండల తుఫాను కారణంగా.. కొన్ని మేఘాలతో కూడిన జల్లులు.. దక్షిణ కాలిఫోర్నియా సరిహద్దులపై విస్తరిస్తున్నాయి. దీంతో సౌర ఉత్పత్తికి సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ హీటెడ్ అట్మాస్ఫియర్ ఇప్పట్లో ముగిసేది కాదంటున్నారు వాతావరణ నిపుణులు.

మస్కిటో ఫైర్ ను అదుపులోకి తెచ్చే సమయంలో ఇక్కడి చికన్ హాక్ రోడ్డులో ఒక ఎయిర్ ట్యాంకర్ దెబ్బ తినింది. దానికి తోడు కాలిఫోర్నియా పవర్ ఆపరేటర్స్ మరో ఫ్లెక్స్ అలెర్ట్ రిలీజ్ చేశారు. స్వచ్ఛంద విద్యుత్ కోతలుంటాయని ప్రకటించారు. ఈ గడువు ముగిసినా.. కరెంటు కోతలు తప్పేలా కనిపించడం లేదు. ఇక వెస్ట్ కోస్ట్ లో బలమైన గాలులు, తక్కువ తేమ గలిగిన వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అంతే కాదు వేసవి చివరి రోజుల్లో ఇలాంటి కార్చిచ్చు ప్రమాదముండి తీరుతుందని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి