Poland: ఆ క్షిపణులు రష్యా దేశానివి కావు.. పోలాండ్‌లో దాడులపై అమెరికా సంచలన ప్రకటన..

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం యుద్ధ మధ్య.. పోలాండ్‌ దేశంలో క్షిపణుల దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. రెండు క్షిపణుల దాడిలో పోలండ్‌కు చెందిన ఇద్దరు మృతి చెందారు.

Poland: ఆ క్షిపణులు రష్యా దేశానివి కావు.. పోలాండ్‌లో దాడులపై అమెరికా సంచలన ప్రకటన..
Missile Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 16, 2022 | 12:17 PM

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం యుద్ధ మధ్య.. పోలాండ్‌ దేశంలో క్షిపణుల దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. రెండు క్షిపణుల దాడిలో పోలండ్‌కు చెందిన ఇద్దరు మృతి చెందారు. దీంతో పోలాండ్ దేశంలో అలర్ట్ ప్రకటించడంతోపాటు.. అధ్యక్షుడు, ప్రధాని అత్యవసరంగా భేటీ అయ్యారు. నేషనల్ సెక్యూరిటీ బ్యూరో సమావేశానికి సైతం పిలుపునిచ్చారు. తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో అమెరికా అధికారులు సంచలన ప్రకటన చేశారు. పోలాండ్‌లో ఈ పేలుళ్లకు కారణమైన క్షిపణి రష్యా దాడిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిందని US అధికారులు తెలిపారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. పోలాండ్‌లో పేలిన క్షిపణులను రష్యన్ క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రేనియన్ దళాలు పేల్చినట్లు సూచిస్తున్నాయని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. పోలాండ్‌లో ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన క్షిపణి పేలుళ్లపై అమెరికా, నాటో మిత్రదేశాలు దర్యాప్తు జరుపుతున్నాయని తెలిపారు. అయితే రష్యా నుంచి ప్రయోగించిన క్షిపణుల వల్ల ఈ పేలుడు సంభవించి ఉండకపోవచ్చని.. ఇది ప్రాథమికంగా సూచిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు.

ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 సమావేశానికి ప్రపంచ నాయకులంతా హాజరై పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. జీ-20 సమ్మిట్ వర్చువల్‌గా యుద్ధ సంక్షోభాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో రష్యన్‌ సేనలు మరోసారి భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో తూర్పు పోలాండ్‌లోని ప్రజెవోడో అనే గ్రామంలో క్షిపణులు పడి ఇద్దరు మరణించారు. ఈ పేలుడు సంభవించిన తరువాత బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన తరువాత బిడెన్ మాట్లాడారు.

కాగా.. రష్యా మిస్సైళ్ల దాడి నేపథ్యంలో కౌంటర్ యాక్షన్‌పై అమెరికా చర్చించింది. ఇదిలాఉంటే.. నాటో పరిధిలోని ప్రతి ఇంచును రక్షించుకుంటామని పెంటగాన్ ప్రకటించింది. నాటో ఆర్టికల్ 5 ప్రకారం భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించడం మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ప్రపంచ వార్తల కోసం..