ఘనంగా ట్రంప్ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ పెళ్లిపీటలెక్కారు. ఫ్లోరిడాలో తన బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ బౌలోస్‌ను వివాహం చేసుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ పెళ్లిపీటలెక్కారు. ఫ్లోరిడాలో తన బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ బౌలోస్‌ను వివాహం చేసుకున్నారు. ట్రంప్‌నకు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్‌లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగేళ్ల ప్రేమాయాణం అనంతరం బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది. ట్రంప్ దగ్గరుండి పెళ్లి వేడుకను జరిపించారు. వధువు టిఫానీని వెంటబెట్టుకొని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం టిఫానీకి ఆప్యాయంగా ముద్దు పెట్టి వరుడి చెయ్యికి వధువు చెయ్యిని అందించారు. ట్రంప్‌కు చెందిన మార్ ఏ లాగో క్లబ్ ఈ వేడుకకు వేదికగా మారింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయత్రం నాలుగున్నర గంటలకు వివాహం జరిగింది. ఈ వేడుకకు ట్రంప్ కుటుంబమంతా హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. డొనాల్డ్ ట్రంప్.. ఆయన రెండో భార్య, నటి మార్ల మాపుల్స్ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మర్లను ట్రంప్ వివాహమాడగా 1999 వరకు వీరు భార్యభర్తలుగా కొనసాగారు. అనంతరం విడాకులు తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
రెండువేల నోట్ల ముద్రణ నిలిపివేత !! అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ కాకపోవడమే కారణమన్న కేంద్రం
Vishal: పెళ్లిపై యాంకర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన విశాల్..
Yashoda: ఓవర్ సీస్‌లోనూ దూసుకెళ్తోన్న ‘యశోద’ !! తిరుగు లేదంటున్న ట్రేడ్ వర్గాలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

