Yashoda: ఓవర్ సీస్‌లోనూ దూసుకెళ్తోన్న ‘యశోద’ !! తిరుగు లేదంటున్న ట్రేడ్ వర్గాలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఓవర్‌సీస్‌లో అయితే సామ్‌కి తిరుగేలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల్లో యశోద యు.ఎస్‌లో నాలుగు లక్షల డాలర్స్ ఇండియన్ కరెన్సీలో 3 కోట్ల 2 లక్షలు వసూలు చేసింది. రీసెంట్‌గా ఓవర్‌సీస్‌లో విడుదలైన మన సినిమాలను పరిశీలిస్తే.. గడచిన రెండు నెలల కాలంలో టాలీవుడ్ నుంచి యు.ఎస్‌లో విడుదలైన సినిమాల్లో యశోద మాత్రమే రెండు రోజుల్లోనే బ్రేక ఈవెన్ సాధించి లాభాలను సాధించిన సినిమా అని సినీ సర్కిల్స్ అంటున్నాయి. విడుదలైన తొలి ఆట నుంచే యశోదకు పాజిటివ్ టాక్ వచ్చింది. నవంబరు 13 న యశోద మూవీకి మూడున్నర కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయని మార్కెట్ వర్గాల సమాచారం. ఇదే పాజిటివ్ బజ్ కొనసాగితే సినిమా ఇంకా మంచి కలెక్షన్స్‌ను దక్కించుకుంటుందని అంటున్నారు. ఓ బేబి తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. కరోనా ఎఫెక్ట్‌తో స్టార్ హీరోల సినిమాలకే ఆదరణ కరువవుతున్న నేపథ్యంలో సమంత మూవీ యశోదకు మంచి బజ్‌తో పాటు కలెక్షన్స్ రావటం అనేది సినీ సర్కిల్స్‌లో కాస్త ఉత్సాహాన్ని నింపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందరూ గాఢ నిద్రలో ఉండగా ఊహించని షాక్.. భయంతో జనం పరుగులు..
Superstar Krishna Final Journey: పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం.. లైవ్ వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

