Bill Gates Issue: ఉద్యోగినితో బిల్ గేట్స్ సంబంధాల ఆరోపణలపై స్పందించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ

Bill Gates Issue: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన సంస్థలో ఒక మహిళతో సంబంధం కలిగి ఉండేవారు అని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Bill Gates Issue: ఉద్యోగినితో బిల్ గేట్స్ సంబంధాల ఆరోపణలపై స్పందించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ
Bill Gates Issue
Follow us

|

Updated on: May 22, 2021 | 9:59 AM

Bill Gates Issue: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన సంస్థలో ఒక మహిళతో సంబంధం కలిగి ఉండేవారు అని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలు బిల్ గేట్స్ విడాకులు తీసుకుంటున్న నేపధ్యంలో మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ స్పందించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  సత్య నాదెళ్ళ మాట్లాడుతూ 2021 మైక్రోసాఫ్ట్ సంస్థ..2000 నాటి మైక్రోసాఫ్ట్ కంటె చాలా భిన్నమైనది అని చెప్పారు. నాతోపాటు మైక్రోసాఫ్ట్ లోని ప్రతి ఒక్కరి దృష్టి మన సంస్కృతి, మన వైవిధ్యం, మన చేరికపైనే ఉందని ఆయన వెల్లడించారు.

ఆ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ వర్క్ కల్చర్ గురించి.. ఇటీవల వచ్చిన బిల్ గేట్స్ పై ఆరోపణల గురించి సత్య నాదెళ్ళ స్పందించారు. ”ఎవరైనా ఏ విషయాన్నైనా లేవనెత్తవచ్చు. ఇరవై ఏళ్ల క్రితం నాటి సంగతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అప్పుడే ఈ విషయంపై మేము విచారణ జరిపాము. దాని ఆధారంగా ఈ విషయాన్ని లేవనెత్తిన వారు సంతృప్తి చెందే విధంగా కార్యాచరణ జరిగింది. ఈ విషయంలో మాపై ఎటువంటి ఒత్తిళ్ళూ లేవు.” అని చెప్పారు. అంతేకాకుండా ” మేము మైక్రోసాఫ్ట్ లో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశామని అనుకుంటున్నాను. మన సంస్కృతి, మన వైవిధ్యం గురించి ఎక్కువగా మేము ప్రాధాన్యత ఇస్తున్నాము.” అని పేర్కొన్నారు. మొత్తమ్మీద చూస్తే మా వర్క్ ప్లేస్ చాలా సౌకర్యవంతంగా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంది. ఒక వేళ ఏదైనా సమస్య వచ్చినా దానిని వెంటనే విచారణ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయి అని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటె ఒక మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపిన దానిప్రకారం..బిల్ గేట్స్ 2000 సంవత్సరంలో కంపెనీ ఉద్యోగితో సన్నిహిత సంబంధాన్ని ప్రారంభించాలని కోరినట్లు తెలిసి కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపేందుకు బయటి న్యాయ సంస్థ సహాయంతో బోర్డు యొక్క కమిటీ ఈ విషయాన్ని సమీక్షించింది. దర్యాప్తు అంతా, ఆందోళన వ్యక్తం చేసిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి విస్తృతమైన సహాయాన్ని అందించింది. ఆ ప్రతినిధి కంపెనీ విడిచి పెట్టాలని బిల్ గేట్స్ తీసుకున్న నిర్ణయం దర్యాప్తుతో సంబంధం లేదని చెప్పినప్పటికీ, బిల్ గేట్స్ 2020 ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ బోర్డును విడిచిపెట్టారు. అయితే, ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ నాయకులకు టెక్నాలజీ సలహాదారుగా బిల్ గేట్స్ కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఆయన ఇప్పటికీ ఈ పాత్రను కలిగి ఉన్నారా అనే దానిపై స్పష్టతను ఆ ప్రతినిధి ఇవ్వలేదు.

దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక వ్యవహారం స్నేహపూర్వకంగా ముగిసింది అని గేట్స్ ప్రతినిధి ఈ వారం ప్రారంభంలో వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఒక ప్రకటనలో తెలిపారు. “బోర్డు నుండి పరివర్తన చెందడానికి బిల్ తీసుకున్న నిర్ణయం ఈ విషయానికి సంబంధించినది కాదు. వాస్తవానికి, చాలా సంవత్సరాల క్రితం తన దాతృత్వానికి ఎక్కువ సమయం కేటాయించటానికి అతను ఆసక్తిని వ్యక్తం చేశాడు.” అంటూ ఆ ప్రతినిధి చెప్పుకొచ్చారు.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు డబ్బు పిచ్చి ఎక్కువేనట.. ఇదిగో ప్రూఫ్ అంటున్న అమెరికా మీడియా

World’s Largest Iceberg: సముద్రంలో విరిగిపడిన అతిపెద్ద మంచుకొండ.. ప్రపంచంలో..