Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు డబ్బు పిచ్చి ఎక్కువేనట.. ఇదిగో ప్రూఫ్ అంటున్న అమెరికా మీడియా
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు డబ్బు పిచ్చి కాస్త ఎక్కువేనట. మరీ ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ పిచ్చి మరింత ముదిరిందని అమెరికా మీడియా వర్గాలు విమర్శలు చేస్తున్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు డబ్బు పిచ్చి కాస్త ఎక్కువేనట. మరీ ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ పిచ్చి మరింత ముదిరిందని అమెరికా మీడియా వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో తనకు జీతం అవసరంలేదని ట్రంప్ నిరాకరించారు. తన జీతాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేసేవారు. అయితే అధ్యక్ష పీఠం నుంచి వైదొలగిన తర్వాత ప్రభుత్వం నుంచి ట్రంప్ పెన్షన్ తీసుకోవడంతో ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అమెరికాలో గుర్తింపు పొందిన బిల్లియనీర్లలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకరు. కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగిన సంపద ఆయన సొంతం. ఫోర్బ్స్ మేగజైన్ అంచనాల మేరకు ఆయనకు 2.4 బిల్లియన్ డాలర్ల ఆస్తులున్నాయి. తాను అతిపెద్ద బిల్లియనీర్ అని చెప్పుకునేందుకు ట్రంప్ కూడా ఇష్టపడుతారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఆయన తనకు జీతం కూడా అవసరం లేదంటూ నేషనల్ పార్క్ సర్వీస్ తదితర సంస్థలకు జీతాన్ని విరాళంగా ఇచ్చేసేవారు. అయితే ఆరు మాసాల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష పదవి కోసం రెండోసారి పోటీచేసి భంగపడ్డారు ట్రంప్. వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలో కూడా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షులకు ఇచ్చే పెన్షన్‌ను ట్రంప్ తీసుకుంటున్నారు.
జనవరి మాసంలో శ్వేత సౌధం వీడినప్పటి నుంచి మాజీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఇప్పటి వరకు 65 వేల డాలర్ల పెన్షన్ తీసుకున్నట్లు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి. ట్రంప్‌కు కాసుల కక్కుర్తి ఎక్కువని…అందుకే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. ట్రంప్ పెన్షన్ తీసుకోవడంపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించేందుకు ఆయన అధికార ప్రతినిధి జాసన్ మిల్లర్ నిరాకరించారు. ఇప్పటికే దేశ ప్రజల పన్ను సొమ్మును ట్రంప్ భారీ మొత్తంలో దుర్వినియోగం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులకు అధిపతి అయిన ట్రంప్… ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం ప్రజల పన్ను సొమ్మును మొక్కటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అమెరికా రాజ్యాంగం మేరకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పెన్షన్లు పొందేందుకు అర్హులు. అయితే పెన్షన్ తీసుకోవాలా? వద్దా? అన్నది మాజీ అధ్యక్షులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2021లో 2,21,400 డాలర్ల వార్షిక్ పెన్షన్ తీసుకోవచ్చు. దీనితో పాటు తన కార్యాలయ ఉద్యోగుల జీతాలు, కార్యాలయ భవంతి బాడుగ, ట్రావెల్ అలవెన్సుల కింద యేటా 10 లక్షల డాలర్లను పొందేందుకు అర్హులు. అయితే బిల్లియనీర్ అయిన ట్రంప్ ఇలా ప్రభుత్వం నుంచి పెన్షన్, ఇత అలవెన్లులు తీసుకోవడం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి…కరోనా సెకండ్ వేవ్.. భారత్‌కు 40 దేశాల సాయం.. విదేశాంగ శాఖ ప్రకటన..
కరోనా సెకండ్ వేవ్.. భారత్‌లో ఫేస్‌బుక్ సరికొత్త టూల్.. ఎలా పనిచేస్తుందంటే..?