కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్‌

అమెరికా పెంచిన ఒత్తిడో లేక పాలస్తీనా చిన్నారుల ఆక్రందనలు మనసును కరిగించాయో తెలియదు కానీ పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్‌పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు స్వస్తి చెప్పబోతున్నది ఇజ్రాయెల్‌.

కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్‌
Israel And Hamas Agree Gaza
Follow us
Balu

| Edited By: Phani CH

Updated on: May 21, 2021 | 10:17 AM

అమెరికా పెంచిన ఒత్తిడో లేక పాలస్తీనా చిన్నారుల ఆక్రందనలు మనసును కరిగించాయో తెలియదు కానీ పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్‌పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు స్వస్తి చెప్పబోతున్నది ఇజ్రాయెల్‌. అంతర్జాతీయ సమాజం మొత్తం దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ వినలేదు సరికదా దాడులను ఉధృతం చేసింది. ఇప్పుడు ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు అంగీకరించింది. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సారథ్యంలో జరిగిన భద్రతా కేబినెట్‌ మీటిం్‌ దీనిపై ఆమోదం తెలిపింది. హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో అమాయక పాలస్తీనియున్లు కన్నుమూస్తున్నారు. గాజాలో చిన్నారులు, మహిళలు ఎంతో మంది చనిపోయారు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి దరకు కనీసం 230 మంది పాలస్తీనియన్లు మరణించారు. అలాగని ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని కాదు. హమాస్‌ రాకెట్ల దాడిలో 12 మంది ఇజ్రాయెల్‌ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దాడులు తప్పంటూ చాలా దేశాలు ఇజ్రాయెల్‌ను తప్పుపట్టాయి. ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారైన అమెరికా కూడా నెతన్యాహుపై ఒత్తిడి పెంచారు.. దాడులు ఆపాలంటూ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్‌ చేసి మరీ కోరారు.

అలాగే శాంతి స్థాపన కోసం ఈజిప్టుతో పాటు చాలా దేశాలు మధ్యవర్తిత్వం నెరిపాయి.. అయినా ఇజ్రాయెల్‌ పట్టించుకోలేదు. హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపేది లేదని స్పష్టంగా చెప్పేసింది ఇజ్రాయెల్‌. ఇప్పుడు కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది మాత్రం చెప్పలేదు. అధికారిక వార్తా ఛానల్‌ కాన్‌ మాత్రం ఇది తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొంది. గాజాపై దాడులు ఆగిపోతే కానీ ఓ స్పష్టత రాదు. మరోవైపు ఇజ్రాయెల్‌ నిర్ణయంపై హమాస్‌ స్పందించింది. ఇజ్రాయెల్‌ దాడులు ఆపితే తాము కూడా ఆపేస్తామని చెప్పంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Devi Temple: కరోనా దేవి ఆలయంలో శాంతి పూజలు..ఎక్కడో తెలుసా..?? ( వీడియో )

India Corona Cases: దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా యాక్టివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగానే మ‌ర‌ణాలు