Migrant Workers: నేపాల్ లో చిక్కుకున్న 26 మంది వలస కార్మికులు.. తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జార్ఖండ్ ప్రభుత్వం!
Migrant Workers: లాక్ డౌన్ కారణంగా జార్ఖండ్ కు చెందిన 26 మంది వలస కూలీలు నేపాల్ లో చిక్కుకున్నారు. వీరు తమ వీడియో సందేశాలతొ ప్రభుత్వాన్ని సహాయం అభ్యర్ధించారు.
Migrant Workers: లాక్ డౌన్ కారణంగా జార్ఖండ్ కు చెందిన 26 మంది వలస కూలీలు నేపాల్ లో చిక్కుకున్నారు. వీరు తమ వీడియో సందేశాలతొ ప్రభుత్వాన్ని సహాయం అభ్యర్ధించారు. ఈ అభ్యర్ధనలపై జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వారిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని డుమ్కా జిల్లాకు చెందిన వలస కార్మికులు లాక్ డౌన్ కారణంగా నేపాల్ లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో ఇరుక్కుపోయినట్టు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక అధికారి మీడియాకు చెప్పారు. వారు ఆరోగ్యంగానే ఉన్నారనీ వారిని వెనక్కి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
“ఈ 26 మంది కార్మికులను జార్ఖండ్ కు తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి … వారి కోసం రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు” అని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఒక లాభాపేక్షలేని సంస్థ శుభ్ సందేష్ ఫౌండేషన్ ఒక సందేశాన్ని రీట్వీట్ చేశారు. దానిలో “నేపాల్‌లో చిక్కుకున్న 26 మంది జార్ఖండ్ వలసదారులకు సహాయం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. నేపాల్‌లోని మా స్నేహితులు వారికి ఆహారం, ట్రావెల్ పాస్, మెడిసిన్ మొదలైన వాటిని సమన్వయపరుస్తున్నారు. ” అని సంస్థ పేర్కొంది. అలాగే శనివారం వారిని తిరిగి తీసుకువచ్చేందుకు గానూ.. రవాణా ఏర్పాట్లు చేసినందుకు ఫౌండేషన్ ముఖ్యమంత్రి సోరెన్, శాసనసభ్యుడు బసంత్ సోరెన్‌లకు ట్విట్టర్ పోస్ట్‌లో ఆ సంస్థ తన ధన్యవాదాలు తెలిపింది.
కాగా, నేపాల్ లో చిక్కుకున్న 26 మంది వలస కార్మికులను రక్షించడానికి కేంద్రం ముందుకు రావాలని జార్ఖండ్ మాజీ శాసనసభ్యుడు, బీజేపీ నాయకుడు కునాల్ సారంగి గురువారం కోరారు. కార్మికుల నుంచి వీడియో సందేశాన్ని జతచేస్తూ, వారిని రక్షించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు.
“నేను దీనిని పరిశీలించమని జైశంకర్ సర్ అలాగే నేపాల్ రాయబార కార్యాలయాన్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. జార్ఖండ్ నుండి వచ్చిన ఈ పేద వలస కూలీలు నేపాల్ లో చిక్కుకున్నారు. వారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. దయచేసి వారిని రక్షించండి. ” అంటూ కునాల్ సారంగి తన ట్వీట్ ద్వారా అభ్యర్ధించారు. ఈ విషయంలో తాను కూడా ప్రయత్నాలు చేస్తున్నానని, నేపాల్ అధికారులను అభ్యర్థిస్తున్నానని బీజేపీ పార్లమెంటు సభ్యుడు జయంత్ సిన్హా సారంగికి చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. కార్మికులకు సహాయం చేస్తామని నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు తనకు హామీ ఇచ్చారని, కార్మికులతో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ వారి రవాణాకు డబ్బులు చెల్లించడానికి అంగీకరించారని సారంగి చెప్పారు.
లాక్ డౌన్ కారణంగా తాము నేపాల్‌లో చిక్కుకుపోయామనీ, వారిలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురయ్యారని, అయితే వైద్య సహాయం, ఆహారం అందడం లేదని చెబుతూ వలస కార్మికులు తమను రక్షించాలని జార్ఖండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తరువాత ఒక ప్రత్యేక సందేశంలో, కార్మికులు శుభ సందేశ్ ఫౌండేషన్ నుండి తమకు సురక్షితంగా తిరిగి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తమకు కమ్యూనికేషన్ వచ్చిందని చెప్పారు.
Bharat Biotech: భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. గుజరాత్‌లోనూ కోవాక్సిన్ టీకా ఉత్పత్తి