Corona Recover: మెడికల్ వండర్.. ఓ వైపు కరోనా.. మరోవైపు కోమా.. యూకే డాక్టర్ గ్రేట్ రికవరీ..
Corona Recover: అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి ఒక్కసారిగా ఆక్సిజన్ అందక కుప్పకూలిపోతాడు. శరీరంలో సడెన్‌గా ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో గుండెపై ప్రభావం పడి...
Corona Recover: అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి ఒక్కసారిగా ఆక్సిజన్ అందక కుప్పకూలిపోతాడు. శరీరంలో సడెన్‌గా ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో గుండెపై ప్రభావం పడి మరణిస్తారు. కోవిడ్ కారణంగా మరణిస్తోన్నవారిలో ఎక్కువ శాతం ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే బతకాలని రాసి పెట్టుండాలనే కానీ ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడొచ్చడానికి చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది యూకేకు చెందిన ఓ డాక్టర్.
వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన డాక్టర్ అనూష గుప్త లండన్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూషకు మార్చిలో కోవిడ్ సోకింది. ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయిలు 80 శాతం కంటే తగ్గిపోయాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో అనూష కోమాలోకి వెళ్లిపోయారు. సుమారు రెండు నెలలపాటు కోమాలో ఉన్నారు . ఆ సందర్భంగా ఆమెకు ఎక్ట్రా కార్పొరల్ మెమ్‌బ్రేన్ ఆక్సీజెనేషన్ మెషిన్ (ఈసీఎమ్ఓ) సహాయంతో ఆక్సిజన్ అందించారు. సుమారు 35 రోజుల పాటు కోమాలోఉన్న అనూష కోమా నుంచి బయటకు వచ్చారు. దాదాపు 150 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనుష అద్భుతంగా రికవరీ అయ్యారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కరోనా నుంచి ఎలా బయటపడిందో చెప్పుకొచ్చారు అనూష. ఆమె మాట్లాడుతూ.. కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఐసీయూలో ఉన్న నాకు వెంటిలేటర్ పెట్టారు. ఈ సందర్భంగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నా కతూరును చూశాను. వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో అందించిన ఈసీఎమ్ఓ మెషిన్ ఎంతో ఉపయోగపడింది. ఇది కృత్రిమ ఊపిరితిత్తుల్లాగా సహాయపడిందని చెప్పుకొచ్చారు. ఇక భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ గురించి అనూష మాట్లాడుతూ.. కఠినమైన లాక్‌డౌన్ విధించడం ద్వారానే భారత్‌లో కరోనాను కట్టడి చేయవచ్చు. సోషల్ డిస్టెన్స్ పాటించడం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా కరోనా వ్యాప్తికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయొచ్చని అనూష అభిప్రాయపడ్డారు.
Also Read: Israel Palestine war: ఇజ్రాయిల్..పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ.. ఫలించిన ఈజిప్టు ప్రయత్నాలు..
Chiranjeevi : కరోనాతో మృతిచెందిన కారవ్యాన్ డ్రైవర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం..