5G Trial Causing Corona: 5జీ పరీక్షల కారణంగానే దేశంలోనే కరోనా వ్యాప్తి.. పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై..
5G Trial Causing Corona: దేశంలో కరోనా విజృంభణ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే సమానంగా ఈ వ్యాధి...
5G Trial Causing Corona: దేశంలో కరోనా విజృంభణ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే సమానంగా ఈ వ్యాధి చుట్టూ పుకార్లు చుట్టుముడుతున్నాయి. గతకొన్ని రోజుల నుంచి కోవిడ్ వ్యాధికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారుతోంది. భారత్‌లో 5జీ నెట్‌వర్క్ ట్రయల్ టెస్ట్ నిర్వహించడం వల్లే కరోనా ఈ స్థాయిలో వ్యాప్తించెందుతుందనేది సదరు వార్త సారాంశం. అయితే దీనిపై ఇప్పటికే పలువురు నిపుణులు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా పుకార్లు మాత్ర ఆగడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా హర్యాన ఛీఫ్ సెక్రటరీ విజయ్ వర్ధన్ జిల్లా మెజేస్ట్రేట్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జీ పరీక్షల వల్లే కరోనా మొదలైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుకార్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ టవర్స్‌ను ధ్వంసం చేసిన సంఘటలను చోటుచేసుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ వార్తలను ఇప్పటికే ఖండిచిందని వర్ధన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై చర్యలను తీసుకోవాలని రాష్ట్రంలోని డీఎమ్, ఎస్‌పీ, ఎస్ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ భారత్‌లో 5జీ నెట్‌వర్క్ పరీక్షలను పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ పుకార్లు ఎవరు నమ్మొద్దని విజయ్ వర్ధన్ చెప్పుకొచ్చారు. మరి సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరుగుతోన్న ఈ రోజుల్లో ఇలాంటి ఫేక్ న్యూస్‌కు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.
ఫేక్ వార్తలపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆర్డర్..
In view of misinformation attributing COVID-19 fatalities/health issues to testing of 5G towers, it should be noted that as per DoT clarification, linking 5G with COVID has no scientific basis. Action will taken against any miscreant spreading rumours: Chief Secy, Haryana (20.05) pic.twitter.com/BDM8BBOOSg
— ANI (@ANI) May 20, 2021