Petrol Diesel Price Today: ప్ర‌ధాన న‌గ‌రాల్లో శుక్ర‌వారం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో నో ఛేంజ్‌.. కొన్ని ప్రాంతాల్లోమాత్రం పెరుగుద‌ల‌..

Petrol Diesel Price Today: వ‌రుస‌గా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌లేదు. అయితే ఇది కేవ‌లం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మ‌ని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం..

Petrol Diesel Price Today: ప్ర‌ధాన న‌గ‌రాల్లో శుక్ర‌వారం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో నో ఛేంజ్‌.. కొన్ని ప్రాంతాల్లోమాత్రం పెరుగుద‌ల‌..
Petrol Diesel Price
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2021 | 6:45 AM

Petrol Diesel Price Today: వ‌రుస‌గా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌లేదు. అయితే ఇది కేవ‌లం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మ‌ని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో పెరుగుద‌ల కనిపించింది. తాజాగా శుక్ర‌వారం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి. * దేశ‌రాజ‌ధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 92.85 గా (గురువారం రూ. 92.85 ) ఉండ‌గా..డీజిల్ ధ‌ర‌ల‌లోనూ మార్పులు లేవు ఇక్కడ లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 83.51 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ రాజ‌ధాని ముంబ‌యిలోనూ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. ఇక్క‌డ శుక్ర‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 99.14 గా (గురువారం రూ. 99.14 ) ఉండ‌గా, డీజిల్ రూ. 90.71 గా ఉంది.

* ద‌క్షిణ భార‌త‌దేశంలో మ‌రో ప్ర‌ధాన న‌గ‌ర‌మైన చెన్నైలో స్వ‌ల్ప మార్పు క‌నిపించింది ఇక్క‌డ‌ శుక్ర‌వారం లీట‌ర్ పెట్రోల్ రూ. 94.64 గా న‌మోదుకాగా (గురువారం రూ. 94.54 ) .. డీజిల్ రూ. 88.43 వ‌ద్ద (గురువారం రూ. 88.34 ) కొన‌సాగుతోంది.

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోనూ ఇంధ‌న ధ‌ర‌ల్లో మార్పులు క‌నిపించ‌లేవు. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ రూ.95.94 గా ఉండ‌గా (గురువారం రూ. 95.94 ) డీజిల్ ధ‌ర రూ. 88.53 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* హైద‌రాబాద్‌లో ఇంధ‌న ధ‌ర‌ల్లో మార్పులు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.50 గా ఉండ‌గా (గురువారం రూ.96.50 ), డీజిల్ ధ‌ర రూ. 91.04 (గురువారం రూ. 91.04 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* ఇక క‌రీంన‌గ‌ర్‌లో మాత్రం కాస్త పెరుగుద‌ల క‌నిపించింది. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ రూ. 96.79 గా న‌మోదుకాగా (గురువారం రూ. 96.37), డీజిల్ రూ. 91.30 వ‌ద్ద కొన‌సాగుతోంది (గురువారం రూ.90.91 ).

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికొస్తే.. విజ‌యవాడ‌లోనూ ఇంధ‌న ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపించింది. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 99.28గా ఉండ‌గా (గురువారం రూ. 98.97 ), డీజిల్ రూ. 93.23 వ‌ద్ద కొనసాగుతోంది.

* సాగ‌ర‌తీరం విశాఖ‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 98.50 గా ఉండ‌గా (గురువారం రూ. 98.07 ), డీజిల్ రూ. 92.46 వ‌ద్ద (గురువారం రూ. 92.06 )కొనసాగుతోంది.

Also Read: KCR : ఇవాళ వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్న సీఎం కేసీఆర్.. కరోనా రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం.!

KTR: మెడిసిన్ ‘బ్లాక్ మార్కెటింగ్’పై ఉక్కుపాదం.. రాష్ట్రంలో 258 మంది అరెస్ట్.. మంత్రి కేటీఆర్ ట్వీట్..

Bharat Biotech: భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. గుజరాత్‌లోనూ కోవాక్సిన్ టీకా ఉత్పత్తి