Bharat Biotech: భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. గుజరాత్‌లోనూ కోవాక్సిన్ టీకా ఉత్పత్తి
Covaxin Production in Gujarat: దేశంలో ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల
Covaxin Production in Gujarat: దేశంలో ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల వ్యాక్సిన్ల కొరత కారణంగా ఈ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. ఈ క్రమంలో దేశంలోని హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ బయోటెక్ హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో కోవాక్సిన్ టీకాల ఉత్పత్తిని చేపడుతుంది. తాజాగా మరోచోట కూడా ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో గుజరాత్‌లోనూ కోవాక్సిన్ టీకాల ఉత్పత్తిని చేపట్టనున్నట్లు గురువారం ప్రకటించింది.
రాష్ట్రంలోని అంకేశ్వర్‌లోని చిరాన్ బెహ్రింగ్ ప్లాంట్‌లో కోవాక్సిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్రాల్లో ఏడాదికి 20 కోట్ల టీకాల ఉత్పత్తికి ప్రణాళిక రచించినట్లు భారత్ బయోటెక్ వివరించింది. వీటి ద్వారా ఏడాదికి 100 కోట్ల టీకాల ఉత్పత్తి స్థాయికి చేరుతామని భారత్ బయోటెక్ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో భారత్ బయోటెక్ తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఊరట కలిగించేలా ఉంది. దేశంలో జనవరి 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొదట్లో ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ల కొరత కారణంగా ఈ కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది.
Also Read: