AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఢిల్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన రోడ్డు.. వెళ్తున్న ట్రక్కు ఎలా పడిందో చూశారా..? వీడియో వైరల్

Watch Video: తుఫాను కారణంగా.. చాలా ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తౌక్టే తుఫాను ప్రభావంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో సైతం వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం

Viral Video: ఢిల్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన రోడ్డు.. వెళ్తున్న ట్రక్కు ఎలా పడిందో చూశారా..? వీడియో వైరల్
Truck Fell Into A Caved Portion
Shaik Madar Saheb
|

Updated on: May 21, 2021 | 5:31 AM

Share

Watch Video: తుఫాను కారణంగా.. చాలా ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తౌక్టే తుఫాను ప్రభావంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో సైతం వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి ఒక్క‌సారిగా భారీ వర్షం కురవడంతో ఢిల్లీ ప్రధాన ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారుల‌పై వరద నీరు నిలువ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీని ప్రభావంతో చాలా చోట్ల రోడ్లు మీద గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని నజాఫ్‌గఢ్‌లో ప్రధాన రహదారి మీదగా వస్తున్న ఓ ట్రక్కు రోడ్డు మీద ఏర్పడిన గుంతలో పడిపోయింది. లారీ వెళ్తున్న క్రమంలో రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రక్కు పడిన వీడియో..

కాగా.. ఈ వీడియోను చూసినవారంతా రోడ్డు అలా కూలిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్ల పరిస్థితి ఇలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ సంఘటన జరిగిన అనంతరం ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకొని రెస్క్యూ నిర్వహించారు.

Also Read:

Covid19 Vaccine: మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా.. ఇప్పటివరకు ఎంత మంది టీకా తీసుకున్నారంటే..!

Waiter Murder for Chicken: చికెన్‌ ముక్కలు లేవన్నందుకు వెయిటర్‌ హత్య.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు