Covid19 Vaccine: మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా.. ఇప్పటివరకు ఎంత మంది టీకా తీసుకున్నారంటే..!

కరోనా దరిచేరవద్దంటే.. టీకా ఒక్కటే పరిష్కారం. దేశంలో టీకా కోసం కోట్లాది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.

Covid19 Vaccine: మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా.. ఇప్పటివరకు ఎంత మంది టీకా తీసుకున్నారంటే..!
Corona Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: May 20, 2021 | 7:49 PM

Covid19 Vaccination: కరోనా దరిచేరవద్దంటే.. వైరస్‌ నుంచి మనం బయటపడాలంటే.. టీకా ఒక్కటే పరిష్కారం. దేశంలో టీకా కోసం కోట్లాది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.. దేశం విధానం. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్ అందాలంటోంది టీవీ9. ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? అందులో మొదటి డోస్ అందిన వారు ఎంత మంది? రెండో డోస్ కూడా తీసుకున్న వారి సంఖ్య ఎంత ఆ వివరాలు డీటేల్‌గా తెలుసుకుందాం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 కోట్ల 76 లక్షల 27 వేల 576 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 14 కోట్ల 63 లక్షల 99 వేల 915 మందికి మొదటి డోస్ అందగా.. 4 కోట్ల12 లక్షల 27 వేల 661 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇప్పటి వరకు 13 లక్షల 28 వేల 895 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఇప్పటి వరకు 78 లక్షల 53 వేల 586 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 37 వేల 220 మందికి మొదటి డోస్ అందగా.. 23 లక్షల 16 వేల 366 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 55 లక్షల 22 వేల నలుగురికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 44 లక్షల 52 వేల 257 మంది. రెండో డోస్ పూర్తైన వారు 10 లక్షల 69 వేల 747 మంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించింది.

ఇక దేశ వ్యాప్తంగా రెండు కంపెనీల వ్యాక్సిన్లు మనకు అందుతున్నాయి. అందులో ఏ కంపెనీ నుంచి ఎన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి అనే వివరాలు చూస్తే.. 16 కోట్ల 77 లక్షల 263 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ అందగా.. కోటి 99 లక్షల 27 వేల 67 మందికి కోవాగ్జిన్ డోసులు అందాయి.

ఇక, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 22 కోట్ల 37 లక్షల 12 వేల 200 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 8 కోట్ల 31 లక్షల 73 వేల 166 మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 14 కోట్ల 5 లక్షల 39 వేల 34 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

కాగా, అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? లేదంటే.. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి… అందరూ వ్యాక్సిన్ తీసుకోండి.. మాయదారి వైరస్ నుంచి రక్షించుకోండి.

Read Also…  దేశంలో ఇంకా మాస్కులు ధరించని 50 శాతం మంది….కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై కలవరం